Lady Devotee

Lady Devotee: ఇదేం భక్తి అక్క.. దేవుడి హుండీలో కర్పూరం వెలిగించి వేసిన మహిళ..

Lady Devotee: ప్రస్తుతం పవిత్ర కార్తీక మాసం నడుస్తోంది. ఈ మాసం సందర్భంగా భక్తులు శివ, వైష్ణవ ఆలయాలకు వెళ్లి దీపాలు వెలిగించడం, పూజలు చేయడం సర్వసాధారణం. అయితే, ఆంధ్రప్రదేశ్‌లోని పిఠాపురంలో ఓ భక్తురాలు చేసిన పనికి అక్కడున్న వారే కాదు, వీడియో చూసిన నెటిజన్లు కూడా షాక్ అవుతున్నారు ఇదేం భక్తి రా నయన అంటున్నారు. 

ఆలయ హుండీని కాల్చిన ఆరతి

ఈ వింత ఘటన పిఠాపురంలోని శ్రీ దత్త స్వామి ఆలయంలో చోటు చేసుకుంది. ఆలయానికి వచ్చిన ఓ మహిళా భక్తురాలు స్వామివారికి కర్పూరం వెలిగించి ఆరతి ఇచ్చింది. అయితే, ఆమెకు ఏమనిపించిందో ఏమో గానీ, ఆ వెలిగించిన కర్పూరాన్ని హుండీలో వేసి అక్కడి నుంచి వెంటనే వెళ్లిపోయింది. కాసేపటికి హుండీలో నుంచి పొగలు వస్తుండటాన్ని గమనించిన ఆలయ సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే హుండీలో నీళ్లు పోసి అగ్నిని ఆర్పేశారు.

ఇది కూడా చదవండి: Bihar Assembly Elections 2025: మాకు స్కీమ్స్ వద్దు.. ఉద్యోగాలు కావాలి..!

హెయిర్ డ్రైయర్‌తో కరెన్సీకి ఆరబెట్టడం

హుండీని తెరిచి చూడగా, అప్పటికే హుండీలో ఉన్న అనేక కరెన్సీ నోట్లు అగ్నికి ఆహుతయ్యాయి. మిగిలిన నోట్లను సిబ్బంది బయటకు తీసి, హెయిర్ డ్రైయర్‌తో తడిచిన నోట్లని ఆరబెట్టి తర్వాత లెక్కపెట్టడం కనబడుతుంది. ఈ దృశ్యాలు మొత్తం వీడియో తీయగా, ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన తెలిసి అందరూ అవాక్కవుతున్నారు. “ఇదెక్కడి భక్తిరా బాబు” అంటూ నెటిజన్లు ఫన్నీగా, ఆశ్చర్యంగా కామెంట్లు పెడుతున్నారు. భక్తి పేరిట ఏమాత్రం ఆలోచించకుండా ఇలాంటి చర్యలకు పాల్పడడం దేవుడికి నష్టం కంటే తనకే ఎక్కువ నష్టం చేకూరుస్తుందని స్థానిక భక్తులు విమర్శిస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *