Lady Aghori:

Lady Aghori: చంచ‌ల్‌గూడ జైలులో అఘోరీ శ్రీనివాస్‌.. మ‌రో 14 రోజుల రిమాండ్‌

Lady Aghori:రాష్ట్ర‌వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారిన లేడీ అఘోరీ అలియాస్ శ్రీనివాస్ కేసులో కీల‌క మ‌లుపు తిరిగింది. గ‌త నెలలో అఘోరీకి విధించిన రిమాండ్ గ‌డువు ముగియ‌డంతో మళ్లీ పోలీసులు కోర్టుకు తీసుకెళ్ల‌గా మ‌రో 14 రోజుల రిమాండ్ విధిస్తూ, ఈ సారి చంచ‌ల్‌గూడ సెంట్ర‌ల్ జైలుకు త‌ర‌లించాల‌ని ఆదేశాలు జారీ చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు సంగారెడ్డి జిల్లా కంది సెంట్ర‌ల్ జైలులో రిమాండ్‌లో ఉంచారు.

Lady Aghori:పూజ‌ల పేరుతో లేడీ అఘోరీ త‌న‌ను మోసం చేసిందని శంక‌ర్‌ప‌ల్లి మండ‌లం ప్రొద్దుటూరులోని ప్ర‌గ‌తి రిసార్ట్స్‌లో నివాసం ఉంటున్న ఓ మ‌హిళ అయిన సినీ నిర్మాత మోకిల పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. పూజ‌లు చేస్తాన‌న్న చ‌నువుతో బెదిరింపుల‌కు దిగిన అఘోరీ ఆ నిర్మాత నుంచి రూ.9.80 ల‌క్ష‌ల‌ను వ‌సూలు చేసినట్లు ఆమె త‌న ఫిర్యాదులో పేర్కొన్న‌ట్టు తెలుస్తున్న‌ది.

Lady Aghori:సినీ నిర్మాత‌ ఫిర్యాదు మేర‌కు గ‌త నెల 22న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో పోలీసులు అదుపులోకి తీసుకొని వివిధ సెక్ష‌న్ల కింద కేసులు న‌మోదు చేశారు. ఆ మేర‌కు 23న చేవెళ్ల జూనియ‌ర్ ఫ‌స్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎదుట హాజ‌రుప‌ర్చారు. న్యాయ‌మూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. దాంతో సంగారెడ్డి జిల్లా కంది జైలుకు త‌ర‌లించారు. అయితే తొలుతు అఘోరీని ఏ బ్యార‌క్‌లో ఉంచాలో తెలియ‌క అక్క‌డి సిబ్బంది త‌ల‌లు ప‌ట్టుకున్నారు. అయితే వైద్య ప‌రీక్ష‌ల అనంత‌రం జైలుకు త‌ర‌లించారు.

Lady Aghori:ఈ 14 రోజుల్లో మోకిల పోలీసులు మూడు క‌స్ట‌డీ కోరారు. అయితే న్యాయస్థానం ఒక‌రోజు మాత్ర‌మే క‌స్ట‌డీకి ఇచ్చారు. దీంతో అఘోరీని పోలీస్‌స్టేష‌న్‌కు త‌ర‌లించిన విష‌యం, సీన్ రీక‌న‌స్ట్ర‌క్ష‌న్‌, మ‌ళ్లీ రిమాండ్‌కు త‌ర‌లించిన విష‌యాల‌ను చివ‌రి నిమిషం వ‌ర‌కు పోలీసులు గోప్యంగా ఉంచారు. మోకిల పోలీసులు అఘోరీని నాలుగు గంట‌లపాటు విచారించారు.

Lady Aghori:ఫిర్యాదుదారు అయిన మ‌హిళా సినీ నిర్మాత ఎలా ప‌రిచ‌యం అయ్యారు? తొలుత క‌లుసుకున్న‌ది ఎక్క‌డ‌? ఎన్నిరోజుల వాళ్ల‌తో క‌లిసి ఉన్నావు? ఎక్క‌డ‌ పూజ‌లు చేసింది? ఆ నిర్మాత నుంచి ఎన్ని ల‌క్ష‌లు తీసుకున్నావు? తీసుకున్న ఆ సొమ్ముతో ఏమి కొనుగోలు చేశావు? మిగ‌తా న‌గ‌దు ఎక్క‌డుంది? ఇవ‌న్నీ ఎందుకు చేస్తున్నావు? ఎవ‌రి స‌పోర్టుతోనే ఇవ‌న్నీ చేస్తున్నావా? అని అఘోరీని పోలీసులు ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. వాట‌న్నింటికీ స‌మాధానం చెప్పిన‌ట్టు తెలిసింది.

Lady Aghori:ఆ 14 రోజుల రిమాండ్ గ‌డువు తీరిపోవ‌డంతో మ‌రోసారి చేవెళ్ల కోర్టుకు అఘోరీని త‌ర‌లించారు. అయితే ఆ కోర్టు న్యాయ‌మూర్తి షాద్‌న‌గ‌ర్ కోర్టులో ఇన్‌చార్జిగా బాధ్య‌త‌ల్లో ఉండ‌గా, అఘోరీని అక్క‌డికే త‌ర‌లించారు. విచారించిన న్యాయ‌మూర్తి.. అఘోరీకి మ‌రో 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో అఘోరీని ప్ర‌త్యేక వాహ‌నంలో చంచ‌ల్‌గూడ జైలుకు త‌ర‌లించారు. ఈ స‌మ‌యంలో మీడియా ప్ర‌తినిధులు మాట్లాడేందుకు ప్ర‌య‌త్నించ‌గా, పోలీసులు అనుమ‌తించ‌లేదు.

ALSO READ  Mahesh kumar goud : కేటిఆర్ తో సన్నిహితంగా ఉన్నోళ్ళు తమతో టచ్‌లో ఉన్నారు

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *