NC24: నాగ చైతన్య హీరోగా తెరకెక్కుతున్న తాజా సినిమా NC24 నుండి రోజురోజుకు కొత్త అప్‌డేట్స్‌తో హైప్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాకు నుండి మరో ఆసక్తికర మైన న్యూస్ బయటకొచ్చింది. బాలీవుడ్‌లో ‘Laapataa Ladies’ సినిమాతో మంచి పేరు సంపాదించిన యంగ్ నటుడు స్పర్శ్ శ్రీవాస్తవ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించబోతున్నాడు అంటూ సోషల్ మీడియాలో న్యూస్ చెక్కర్లు కొడుతోంది.
స్పర్శ్ శ్రీవాస్తవ చిన్న వయసులోనే తన కెరీర్‌ను ప్రారంభించాడు. Chak Dhoom Dhoom డ్యాన్స్ రియాలిటీ షో ద్వారా పాపులర్ అయ్యాడు. తరువాత Balika Vadhu, Fear Files, Gumrah వంటి టీవీ షోలతో పాటు Jhalak Dikhhla Jaa లాంటి ప్రోగ్రామ్‌లలో కూడా కనిపించాడు. అయితే అతనికి అసలు బ్రేక్ ఇచ్చిన ప్రాజెక్ట్ Netflix వెబ్ సిరీస్ ‘Jamtara – Sabka Number Ayega’. ఇందులో సన్నీ పాత్రలో అతను చూపిన నటనకు విశేషంగా ప్రశంసలు దక్కాయి.
తాజాగా స్పర్శ్, కిరణ్ రావు దర్శకత్వం వహించిన ‘Laapataa Ladies’ సినిమాలో హీరోగా నటించి. విమర్శకుల ప్రశంసలు పొందడమే కాకుండా, అతని నటన బాగా ఆకట్టుకుంది. అదే ఉత్సాహంతో ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు అడుగుపెడుతున్నాడు.
NC24లో అతని పాత్ర ప్రత్యేకంగా ఉండబోతోందని చిత్రబృందం చెబుతోంది. ఈ సినిమాలో అతని ఎంట్రీ కథలో కొత్త మలుపులు తీసుకురానుందని అంచనా.
ఇది కూడా చదవండి: Lakshmi Menon: నటి లక్ష్మీ మేనన్‌కు ఊరట.. ఐటీ ఉద్యోగి కిడ్నాప్ కేసులో బెయిల్
సినిమా రెగ్యులర్ షూట్ ఇప్పటికే మొదలైంది. NC24 ఇది నాగ చైతన్య కెరీర్‌లోనే అత్యంత ఖరీదైన చిత్రంగా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమా ఒక మిథాలజికల్ థ్రిల్లర్, ఇందులో నాగ చైతన్య కొత్త లుక్‌లో కనిపించబోతున్నాడు. కథలో ఆర్కియాలజికల్ అడ్వెంచర్ థీమ్ ప్రధానంగా ఉండబోతుంది
ఈ చిత్రానికి కార్తీక్ దండు దర్శకత్వం వసిస్తున్నారు.Sri Venkateshwara Cine Chitra LLP మరియు Sukumar Writings బ్యానర్స్‌పై ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో నిర్మాణం అవుతోంది.
సినిమా బృందం ఇప్పటివరకు కథ, పాత్రలపై ఎక్కువ వివరాలు బయటపెట్టకపోయినా, స్పర్శ్ శ్రీవాస్తవ ఎంట్రీతో NC24 పై అంచనాలు మరింత పెరిగాయి. నాగ చైతన్య కెరీర్‌లో మైలురాయిగా నిలిచే ఈ చిత్రంలో స్పర్శ్ పాత్ర కథకు కీలక మలుపు తీసుకురానుందని టాక్.
Laapataa Ladies Actor #SparshShrivastava Onboard For #NC24 #NagaChaitanya #Sukumar #KarthikVarmaDandu pic.twitter.com/KpmNqrTkhi
— s5news (@s5newsoffical) August 28, 2025