L2 Empuraan

L2 Empuraan: చరిత్ర సృష్టించిన ‘ఎంపురాన్’!

L2 Empuraan: మలయాళ సినీ ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తూ మోహన్‌లాల్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “ఎంపురాన్” బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ప్రముఖ నటుడు, దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ తెరకెక్కించిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ రిలీజై, కాంట్రవర్సీలను సైతం అధిగమించి రికార్డు వసూళ్లతో కొత్త ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. గత ఏడాది మలయాళంలో వచ్చిన సూపర్ హిట్ చిత్రాల వసూళ్లను “ఎంపురాన్” కేవలం 10 రోజుల్లోనే అధిగమించి, వరల్డ్ వైడ్‌గా 250 కోట్లకు పైగా గ్రాస్ సాధించినట్లు సమాచారం. ఈ చిత్రం భారీ హైప్‌తో పాటు వివాదాలను ఎదుర్కొన్నప్పటికీ, అభిమానుల ఆదరణతో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. మోహన్‌లాల్ ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులను ఆకట్టుకున్న ఈ మూవీ, మలయాళ సినిమా స్థాయిని మరోస్థాయికి తీసుకెళ్లిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ విజయంతో హీరో మోహన్ లాల్, దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్, చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తూ, ఈ సక్సెస్‌ను అభిమానులతో పంచుకుంటున్నారు. “ఎంపురాన్” విజయం మలయాళ సినిమాకు కొత్త ఒరవడిని సృష్టించిందని, ఇది ఇండస్ట్రీలో చరిత్ర సృష్టించిన చిత్రంగా నిలిచిపోతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *