Kurnool Bus Accident:ఏపీలోని కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర దుర్ఘటనలో సాఫ్ట్వేర్ ఇంజినీర్లయిన ఇద్దరు యువతులు సజీవ దహనం అయ్యారు. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తన్న బస్సు.. ఓ బైక్‌ను ఢీకొనడంతో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనతో బస్సు దహనమైంది. డోర్ లాక్ కావడంతో ప్రయాణికులందరూ బయటపడలేకపోయారు. సుమారు 20 మందికి పైగా చనిపోయారు. వారిలో ఆ ఇద్దరు కూడా ఉన్నారు.
Kurnool Bus Accident:తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం వస్తాకొండూరు గ్రామానికి చెందిన అనూషరెడ్డి, ఏపీలోని బాపట్ల జిల్లా యద్ధనపూడి మండలం పూసపాడుకు చెందిన గన్నమనేని ధాత్రి (27) బెంగళూరులో వేర్వేరు సాఫ్ట్వేర్ కంపెనీలలో ఉద్యోగాలు చేస్తున్నారు. ఆ ఇద్దరు యువతులు దీపావళి పండుగ కోసం తమ ఇళ్లకు వచ్చి, తిరుగు ప్రయాణంలో ఈ ఘోర దుర్ఘటన చోటుచేసుకున్నది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు.
Kurnool Bus Accident:దీపావళి పండుగ కోసం అనూషరెడ్డి తమ సొంతూరైన వస్తాకొండూరుకు వెళ్లగా, ధాత్రి హైదరాబాద్‌లో ఉండే తన మేనమామ వద్దకు వెళ్లింది. ఆ ఇద్దరూ బెంగళూరు వెళ్లేందుకని హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి-కావేరి ట్రావెల్స్ బస్సును ఎక్కారు. ఖైరతాబాద్‌లో అనూషరెడ్డి బస్సు ఎక్కింది. ఆ ఇద్దరూ తెల్లారితే తమ కంపెనీలలో ఉద్యోగ విధుల్లో చేరి హాయిగా ఉండేవారు. కానీ విధి వక్రించి బస్సు ప్రమాద ఘటనలో వారిద్దరూ సజీవ దహనమై కానరాని లోకాలకు వెళ్లారు. ఇటు వారి కుటుంబాల్లో, అటు వారు పనిచేస్తున్న కంపెనీలలో విషాదఛాయలు అలుముకున్నాయి.

