kumki elephant: ఏపీ, కర్ణాటక మధ్య కుంకీ ఏనుగుల ఒప్పందం

kumki elephant: కుంకీ ఏనుగుల వ్యవహారంలో కర్ణాటకతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. విజయవాడలో జరిగిన సమావేశంలో ఇరు రాష్ట్రాల అటవీ అధికారులు ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. ఈ ఒప్పందంలో భాగంగా అటవీ అభివృద్ధికి పరస్పర సహకారం అందించుకోవాలని నిర్ణయించారు. కుంకీ ఏనుగులు శిక్షణ పొంది ఉంటాయి. అడవి ఏనుగులను మచ్చిక చేసుకొని వాటికి అనుకూలంగా మలుచుకుంటాయి. జనారణ్యంలో సంచరించే వాటిని తిరిగి అడవిలోకి తీసుకెళ్తాయి.

kumki elephant: అడగ్గానే 8 కుంకీ ఏనుగులను కర్ణాటక ప్రభుత్వం ఇచ్చిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. విజయవాడలో ఆయన మాట్లాడారు. ‘ఏనుగుల దాడులను ఎదుర్కొనే సమర్థత కర్ణాటకకు ఉందని తెలిసింది. వెంటనే అక్కడి ప్రభుత్వాన్ని సంప్రదించి కుంకీ ఏనుగులు కావాలని కోరాం. వెంటనే స్పందించి వాటిని అందజేసింది. చిత్తూరు, మన్యం, శ్రీకాకుళం జిల్లాలకు వీటిని తరలించి ఏనుగుల దాడిని అరికడతాం’ అని ఆయన వ్యాఖ్యానించారు.

kumki elephant: కుంకీలు పూర్తి స్థాయిలో శిక్షణ పొందిన ఏనుగులు. ఎక్కడైనా ఏనుగుల గుంపు దాడికి దిగినప్పుడు కుంకీలను రంగంలోకి దింపుతారు. ఏనుగులను తరమికొట్టడంలో ఇవి కీలక భూమిక పోషిస్తాయి. కొన్నిసార్లు గాయపడిన లేదా చిక్కుకున్న అడవి ఏనుగును రక్షించడానికీ వీటిని ఉపయోగిస్తారు. సాధారణంగా కుంకీ ఏనుగులుగా మగవాటినే ఎంపిక చేసుకుంటారు. ఎందుకంటే ఇవి మాత్రమే ఒంటరిగా సంచరిస్తుంటాయి.

kumki elephant: వీటిని బంధించి కొన్ని నెలల పాటు శిక్షణ ఇస్తారు. తర్వాత ఆపరేషన్ల కోసం వాడుతుంటారు. ఏనుగుల గుంపును అడవిలోకి తిరిగి పంపించేంత వరకు ఇవి విశ్రమించవు. కొన్నిసార్లు పంట పొలాలపైకి వచ్చిన ఏనుగులతో ఇవి తలపడాల్సి ఉంటుంది కూడా. అందుకే పోరాడడంలోనూ వీటికి ప్రత్యేక శిక్షణ ఇస్తారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *