Kukatpally Murder Case: కూకట్‌పల్లి దయార్‌గూడలో 11ఏళ్ల చిన్నారి సహస్ర హత్య కేసు విచారణలో ఆశ్చర్యపరిచే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసుల దర్యాప్తుతో నిందిత బాలుడి క్రూరమైన మానసిక స్థితి ఒక్కొక్కటిగా బయటపడుతోంది.
పక్కా ప్లాన్‌తోనే హత్య
విచారణలో బాలుడు యూట్యూబ్‌లో క్రైమ్ సీన్స్,  దొంగతనం ఎలా చేయాలి. ఎలా తపించుకోవాలి అనే విషయాలు చేసేవాడు.   వీడియోలు చేసే సహస్రను హత్య చేసినట్టు వెల్లడైంది. హత్య అనంతరం ఆధారాలు మాయం చేయడం ఎలా అనే విషయాన్ని కూడా ఆన్‌లైన్‌లో చూసినట్టు పోలీసులు గుర్తించారు. దొంగతనాలు, తప్పించుకునే మార్గాల గురించి కూడా వివరాలు సేకరించి, వాటిని కాగితంపై రాసుకున్నట్టు సమాచారం.
సైకోలా ప్రవర్తన
చిన్న వయసులోనే ‘సైకో’ లక్షణాలు ప్రదర్శించిన నిందితుడు క్రిమినల్ ఇంటెలిజెంట్‌గా వ్యవహరించాడు. హత్య తర్వాత కత్తిని కడిగి ఇంటికి తీసుకెళ్లి ఫ్రిజ్‌పై పెట్టినట్టు, రక్తపు మరకలతో ఉన్న టీ-షర్ట్‌ను వాషింగ్ మెషీన్‌లో వేశానని విచారణలో ఒప్పుకున్నాడు.
ఇది కూడా చదవండి: Lokesh Kanagaraj: రజినీ-కమల్ కోసం లోకేష్ మాస్టర్ ప్లాన్!
సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సమాచారంతో విప్పిన కేసు
పోలీసులను తప్పుదోవ పట్టిస్తూ నాలుగు రోజుల పాటు ముప్పతిప్పలు పెట్టిన నిందితుడు చివరికి చిక్కాడు. హత్య జరిగిన రోజున ఓ బాలుడు గోడ దూకి అపార్ట్‌మెంట్‌లోకి వచ్చినట్టు సాక్ష్యం ఇచ్చిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సమాచారం కీలకంగా మారింది. అదే ఆధారంగా పోలీసులు నిందితుడిని గుర్తించి పట్టుకున్నారు.
క్రికెట్ బ్యాట్ దొంగతనం నుంచి హత్యకు
మొదట క్రికెట్ బ్యాట్ దొంగతనం కోసం సహస్ర ఇంట్లోకి వెళ్లిన బాలుడు, అక్కడ బాలికను చూసిన వెంటనే పాశవికానికి పాల్పడ్డాడు.
జువైనల్ హోంకు తరలింపు
నిందితుడిని పోలీసులు జువైనల్ జస్టిస్ బోర్డు ఎదుట హాజరుపరిచి, అనంతరం జువైనల్ హోంకు తరలించారు. త్వరలోనే కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను సీపీ వెల్లడించనున్నారు.


