KTR: తెలంగాణలో రాజకీయ వేడి పెరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి రైతుల సమస్యలపై ఓపెన్ డిబేట్‌కు సవాల్ విసరగా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆ సవాల్‌ను స్వీకరించారు. రేవంత్ ఎక్కడైనా వేదికను సూచిస్తే తాను చర్చకు సిద్ధమని చెప్పిన కేటీఆర్, “నాకు భయమేమీ లేదు.. జూలై 8 ఉదయం 11 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌కు వస్తా” అని ప్రకటించారు.
అనుసరించి, కేటీఆర్ ముందుగా తెలంగాణ భవన్‌కు చేరుకొని, అక్కడి నుంచి పార్టీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలతో కలిసి ప్రెస్ క్లబ్‌కు బయల్దేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ,
“తెలంగాణలో మోసం పాలన జరుగుతోంది. రైతులు, మహిళలు, అన్ని వర్గాల ప్రజలు మోసపోతున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చడంలేదు. అసెంబ్లీలో మైక్ కట్ చేస్తూ మాట్లాడనివ్వరు. అందుకే బయట ఓపెన్ డిబేట్‌కు సిద్ధమయ్యా,” అన్నారు.
అలాగే,
“రేవంత్ రెడ్డి, కేసీఆర్, నేను – ఎవరు అయినా రండి అని సవాల్ చేశారట. మేము సిద్ధంగా ఉన్నాం. సీఎం రేవంత్ ఢిల్లీ వెళ్లారు. కనీసం వ్యవసాయ మంత్రి లేదా ఉప ముఖ్యమంత్రి అయినా రావొచ్చు. ఈరోజు కాకపోయినా మరో రోజు సరే.. మేము సిద్ధంగా ఉంటాం,” అని చెప్పారు.
అసెంబ్లీలో మైక్ కట్ చేయకుండా మాట్లాడనిస్తే అక్కడే చర్చించడానికి కూడా సిద్ధమని కేటీఆర్ తెలిపారు.
పోలీసులు అప్రమత్తం
ఈ డిబేట్‌కు పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు రావడంతో, పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. పోలీసుల బందోబస్తు మధ్య చర్చకు వేదికగా ప్రెస్ క్లబ్ సిద్ధమైంది.
కేటీఆర్ ఇప్పటికే చింతమడక, కొడంగల్, గజ్వేల్ వంటి చోట్ల కూడా చర్చకు సిద్ధమని చెప్పినప్పటికీ, చివరికి సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌ను వేదికగా ఎన్నుకున్నారు.
రాజకీయ మాటల యుద్ధానికి రంగం సిద్ధం!
ఈ రాజకీయ సవాల్ ఇప్పుడు పెద్ద దుమారమే రేపుతోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం మరింత తీవ్రతరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి:
Harish Rao: నేడు మరోసారి కాళేశ్వరం కమిషన్ ముందుకు హరీశ్‌రావు
EX MLA Prasanna Kumar Reddy: వైసీపీకి బిగ్ షాక్.. మాజీ ఎమ్మెల్యే ఇంటిపై దాడి – ఫర్నీచర్, కారు ధ్వంసం

