KTR-Revanth Reddy: జాతీయ చేనేత దినోత్సవాన్ని (National Handloom Day) పురస్కరించుకుని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి ఒక ఘాటైన బహిరంగ లేఖ రాశారు. రాష్ట్ర సంస్కృతికి, అస్తిత్వానికి ప్రతీకగా నిలిచిన చేనేత కార్మికుల పరిస్థితి కాంగ్రెస్ పాలనలో తీవ్రంగా దిగజారిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
-
నేతన్న బీమా & చేయూత బంద్: 55,000 మందికి పైగా కార్మికులకు ప్రీమియం చెల్లిస్తూ అందించిన ‘నేతన్న బీమా’ (రూ. 5 లక్షల ఇన్సూరెన్స్), అలాగే పొదుపునకు ఊతమిచ్చే ‘నేతన్నకు చేయూత’ పథకాల చెల్లింపులను నిలిపివేశారని మండిపడ్డారు.
-
ప్రభుత్వ ఆర్డర్ల కోత: గతంలో బతుకమ్మ చీరలు, పాఠశాల యూనిఫారాల తయారీ ఆర్డర్లను నేరుగా చేనేత కార్మికులకే ఇచ్చేవారని, కానీ ఇప్పుడు కమీషన్ల కోసం ఆ ఆర్డర్లను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తున్నారని ఆరోపించారు.
-
పావలా వడ్డీ & రిబేట్లు: సహకార సంఘాలకు అందాల్సిన పావలా వడ్డీ రుణాలు, 20% మార్కెటింగ్ రిబేట్లు పూర్తిగా బంద్ అయ్యాయని విమర్శించారు.
హామీలేవీ?.. బీజేపీ–కాంగ్రెస్‌ల వైఖరి ఒక్కటే!
“ఏడాదికి రూ. 18,000 ‘చేనేత భరోసా’, లక్ష రూపాయిల రుణమాఫీ, 5 శాతం జీఎస్టీ రీయింబర్స్‌మెంట్ ఇస్తామన్న హామీలు కాగితాలకే పరిమితమయ్యాయి. మరోవైపు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ బోర్డును రద్దు చేయడం, జీఎస్టీ విధించడం ద్వారా చేనేత రంగాన్ని దెబ్బతీసింది. రంగులు వేరైనా చేనేతల విషయంలో కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ తీరు ఒక్కటే!”— కేటీఆర్ (బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్)
కేటీఆర్ ప్రధాన డిమాండ్లు..
-
గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘నేతన్న బీమా’, ‘నేతన్నకు చేయూత’ పథకాలను వెంటనే పునరుద్ధరించి బకాయిలు విడుదల చేయాలి.
-
మేనిఫెస్టోలో ఇచ్చిన చేనేత భరోసా, రుణమాఫీ, జీఎస్టీ భారం మినహాయింపు హామీలను యుద్ధప్రాతిపదికన అమలు చేయాలి.
-
“మన చేనేత… మన గౌరవం. నేతన్న బతికితేనే మన సంస్కృతి, స్వాభిమానం బతుకుతాయి” అని పేర్కొంటూ ప్రభుత్వం ఇప్పటికైనా కంటితుడుపు చర్యలు ఆపి నిజమైన భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలోని నేతన్నల తరఫున ముఖ్యమంత్రి రేవంత్‌కు బహిరంగ లేఖ రాసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
✳️ నేతన్నల కడుపు కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
✳️ కేసీఆర్ హయాంలో అమలైన చేనేత సంక్షేమ పథకాలను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్
✳️ నేతన్నలకు ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీ అమలు… pic.twitter.com/xfomWlwlr7
— BRS Party (@BRSparty) August 7, 2026
