Kalki: రెబల్ స్టార్ ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఎపిక్ సైన్స్ ఫిక్షన్ సినిమా ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) ప్రతిష్టాత్మక జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకలో సత్తా చాటింది. దేశ రాజధాని న్యూఢిల్లీలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా చిత్ర బృందం ఈ అత్యున్నత పురస్కారాలను అందుకుంది.
రెండు విభాగాల్లో జాతీయ పురస్కారాలు..
ఇది మా కలల ప్రయాణంలో మైలురాయి.. వైజయంతి మూవీస్ భావోద్వేగం
ఈ సందర్భంగా జాతీయ అవార్డుల జ్యూరీకి, ప్రపంచవ్యాప్తంగా ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. పెద్ద కలలు కనే ప్రయాణంలో ఇది మరొక మైలురాయి అని చెబుతూ.. ఎలాంటి భయాలు లేకుండా కథల హద్దులను దాటుతూ ‘కల్కి’ తదుపరి అధ్యాయాన్ని (Kalki Part 2) అంతకుమించి తీర్చిదిద్దనున్నట్లు స్పష్టం చేశారు.
