Aadarsha Kutumbam: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ఆదర్శ కుటుంబం’ (#Venky77) రిలీజ్ విషయంలో మేకర్స్ ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. దసరా కానుకగా అక్టోబర్ 2న థియేటర్లలోకి రావాల్సిన ఈ సినిమా వారం రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. కొత్త తేదీ ప్రకారం ఈ సినిమా అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ మేరకు ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
ఆలస్యంగా వస్తున్నాం.. కానీ బ్లాక్‌బస్టర్ వినోదం ఖాయం..
ఎస్. రాధాకృష్ణ (చినబాబు) అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, ఎస్. తమన్ అదిరిపోయే సంగీతాన్ని అందిస్తున్నారు. వారం ఆలస్యంగా అక్టోబర్ 9న థియేటర్లలోకి రానున్న ఈ ‘ఆదర్శ కుటుంబం’ ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు మాస్ ప్రేక్షకులను ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి.
#AK47 will be arriving a week later, but we promise you… BLOCKBUSTER ENTERTAINMENT! 🔥❤️#AadarshaKutumbam 🏠 now arrives in theatres on OCTOBER 9th! 💥💥#AK47OnOct9th 🔥#Venky77 | #VenkateshXTrivikram |
Victory @VenkyMama #Trivikram @SrinidhiShetty7 @IamRohithNara… pic.twitter.com/gFdaK0wqYU
— Haarika & Hassine Creations (@haarikahassine) September 22, 2026
