KTR: ఫార్ములా ఈ-కార్ రేస్ కేసు విషయం మళ్లీ చర్చనీయాంశమైంది. ఇప్పటికే తెలంగాణ హైకోర్టులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ క్వాష్ పిటిషన్ వేశారు. ఈ క్వాష్ పిటిషన్‌పై శుక్రవారమే విచారణ జరగనున్నది. కేటీఆర్ వేసిన ఈ పిటిషన్‌ను కొట్టివేయాలని ఏసీబీ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. దీనిపైనే ఈ రోజు విచారణ జరుగుతుంది.
KTR: కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్‌పై ఫార్ములా ఈ-కార్ రేస్ కేసు విచారణను ఈ నెల 31వరకు వాయిదా వేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఈ నెల 31 వరకు కేటీఆర్ అరెస్టుపై ఉన్నత న్యాయస్థానం స్టే పొడిగించింది. దీంతో ఈ కేసులో కేటీఆర్ క్వాష్ పిటిషన్‌ను కొట్టివేయాలని ఏసీబీ న్యాయస్థానాన్ని కోరుతూ పిటిషన్ వేసింది. దీనిపై అంతటా ఉత్కంఠ నెలకొన్నది.