Parthasarathi: రాయలసీమ ముఖద్వారము కర్నూలు జిల్లా… వైసీపీకి గట్టి పట్టున్న జిల్లా… అలాంటి జిల్లాలో గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విజయ ఢంకా మోగించింది.ఉమ్మడి కర్నూల్ జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో 12 స్థానాల్లో కూటమి అభ్యర్థులు తమ ఆధిపత్యాన్ని చూపారు.కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం కర్నూల్ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తోంది. గెలిచిన ఎమ్మెల్యేలు కూడా నియోజకవర్గ అభివృద్ధికి పాటు పడుతూ అడుగులు వేస్తున్నారు. కానీ ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి మాత్రం అన్ని తానే అంటూ అధికారులకు, కూటమి కార్యకర్తలకు, నాయకులకు వార్నింగ్ చేస్తున్నారట.
గత ఎన్నికల్లో ఆదోని బీజేపీ అభ్యర్థి డాక్టర్ పార్థసారథి పోటీ చేసి కూటమి వేవ్‌లో గెలుపొందారు ఆదోని కూటమి నాయకులంతా కలిసి పార్థసారథిని గెలిపించుకున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా గెలిచిన తర్వాత నుంచి ఎమ్మెల్యేగా పార్థసారథి కూటమి నాయకులను పట్టించుకోలేదని ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చాయి. అంతేకాక గెలుపుకు సహకరించిన కార్యకర్తలను కూడా దూరంగా పెట్టడంపై కూడా పలు విమర్శలు వెల్లువెత్తాయి దీంతో ఇటు బీజేపీ అధిష్టానానికి అటు టీడీపీ అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్లాయి. ఈ నేపథ్యంలో టీడీపీ అధిష్టానం కూటమి అభ్యర్థుల కుమ్ములాటలకు స్వస్తి పలికెందుకు మంత్రి టీజీ భరత్‌కు బాధ్యతను అప్పగించారు. అంతా సద్దు మణిగిందన్న సమయంలో ఎమ్మెల్యే పార్థసారది చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అయ్యాయి.
Parthasarathi: గత వారం కిందట జరిగిన కూటమి సమావేశంలో ఎమ్మెల్యే పార్థసారథి వైసీపీ నాయకులను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఆదోనిలో తాను చెప్పిందే జరగాలంటూ అల్టిమేటం జారీ చేయడంపై దుమారం రేగుతోంది. తాను చెబితే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పినట్టే…అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై అక్కడున్న కూటమి నాయకులు అవాక్కయ్యారు. గత ఐదేళ్ల పాలనలో వైసీపీ నేతలు అనుభవించిన ఫీల్డ్ అసిస్టెంట్, మిడ్డే మీల్స్ రేషన్ షాపులు వదలేసి వెళ్ళాల్సిందేనంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు.
ఈ వ్యాఖ్యలు వైసీపీ నేతలను ఉద్దేశించి చేశారని బీజేపీ నేతలు చెబుతున్నప్పటికీ… టీడీపీ నేతలు మాత్రం ఎమ్మెల్యే వ్యాఖ్యలపై కాస్తా గుర్రుగానే ఉన్నారట… ఇప్పుడు ఇలాంటి చేయాల్సిన అవసరం ఏమి ఉందటు గుసగుసలాడుకుంటున్నారు. కూటమి కార్యకర్తలు అందరూ శాంతి యుతంగా ఉండాలనీ… రౌడీయిజం, గుండాయిజం నచ్చదు అంటూ శాంతి వచనాలు వల్లించారు ఎమ్మెల్యే పార్థసారథి.
Parthasarathi: మొత్తానికి కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమైనవి. తన నియోజకవర్గంలోని అధికారులకు కూడా ఆయన హుకం జారీ చేశారు. తాను చెప్పింది ఫైనల్ అంటూ కూడా ఆర్డర్ చేయడంపై కూడా చర్చ జరుగుతుంది. ఎమ్మెల్యే పార్థసారథి రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ అధిష్టానం కానీ లేదా టీడీపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
రాసిన వారు: ఖలీల్
సీనియర్ కరస్పాండెంట్
కర్నూలు జిల్లా