సీఎం రేవంత్ రెడ్డి పై విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి కేటీఆర్. రేవంత్ రెడ్డి మూసీ బాధితుల పాలిట కాలయముడిలా తయారయ్యడని అన్నారు. ఎవరి కమీషన్ల కోసం మూసీ సుందరీకరణ అంటున్నరని ప్రశ్నించారు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగాన్ని మొత్తం పడగొట్టారని.. కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు భయపడుతున్నారని ఆరోపించారు.
హైడ్రా పేరుతో ప్రభుత్వం అమాయక ప్రజల ఇండ్లు కూలుస్తోందని ఫైర్అయ్యారు. బాధితులకు తాము అండగా ఉండి బుల్డోజర్లకు అడ్డుగా నిలబడతామన్నారు. 100 రోజుల్లో చేస్తామన్న పనులను 300 రోజులు దాటినా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని ఆరోపించారు. ఇల్లు అనేది ప్రతిఒక్కరికి ఉద్వేగంతో కూడిన అనుబంధం. అన్ని అనుమతులు తీసుకొని కట్టుకున్న ఇళ్లను ఎలా కూల్చేస్తారు? అని ప్రశ్నించారు