KTR: సినిమా వాళ్ళతో సెటిల్ చేసుకున్న రేవంత్.. కేటీఆర్ షాకింగ్ కామెంట్

KTR: తెలంగాణ రాజకీయాల్లో వేడి పుట్టిస్తున్న అల్లు అర్జున్ వ్యవహారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి కేవలం ప్రచారం కోసం మాత్రమే సినిమా ప్రముఖుల గురించి మాట్లాడుతున్నారని ఆరోపించారు. హామీలు, ప్రజా సమస్యల నుంచి దృష్టి మరల్చేందుకే అల్లు అర్జున్ అరెస్ట్ జరిగిందని విమర్శించారు. నిత్యం ప్రజల దృష్టిని మళ్లించేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు.

సినీ ప్రముఖులతో రేవంత్ రెడ్డి ఎదో రకంగా సెటిల్ కి  వచ్చారని, అందుకే ఈ విషయం గురించి ఇప్పుడు మాట్లాడటం లేదని కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ, వివిధ సమస్యలపై ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించారు.

గురుకులాల్లో మరణించిన విద్యార్థుల కుటుంబాలకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. అలాగే, ఆటో డ్రైవర్ల కుటుంబాలకు కూడా పరిహారం ఇవ్వాలని కోరారు. రైతన్నలు, నేతన్నల మరణాలపై సీఎం స్పందించాలని సూచించారు. ప్రతి కుటుంబానికి రూ. 25 లక్షల పరిహారం ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

తనపై ఏసీబీ నమోదు చేసిన కేసుల్లో ఎలాంటి బలం లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తల్లో విశ్వాసం, ఆత్మస్థైర్యం కనిపిస్తోందని తెలిపారు. ఈ-కార్ రేసింగ్ వ్యవహారంలో తాను ఎక్కడా మాట మార్చలేదని, తన మాటకు కట్టుబడి ఉన్నానని చెప్పారు.

కోర్టులపై నమ్మకం

తనపై దాఖలైన కేసులను కోర్టులో సవాల్ చేస్తానని చెప్పారు. ప్రభుత్వం తనపై నమోదు చేసిన కేసులు భయపెట్టవని, వాటిని ధైర్యంగా ఎదుర్కొంటానని కేటీఆర్ చెప్పారు.

బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఎప్పుడు బయటకు రావాలో ఆయనకు తెలుసునని, 2025లో పార్టీ వ్యవస్థాగత కమిటీ ఏర్పాటుకు సిద్ధమవుతున్నామని కేటీఆర్ వెల్లడించారు. పీవీ నరసింహారావుపై కాంగ్రెస్ వివక్ష చూపుతోందని ఆరోపించారు. ఢిల్లీలో పీవీకి మెమోరియల్ కట్టాలని అసెంబ్లీలో తీర్మానం చేయలేదని విమర్శించారు.

బీజేపీపై విమర్శలు

సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ ఎంపీలు రక్షణ కవచంగా మారారని ఎద్దేవా చేశారు. అమృత్, సివిల్ సప్లై స్కాంలపై కేంద్రం ఎందుకు విచారణ జరుపడం లేదని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయాన్ని సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  UP: ముగ్గురు గర్ల్‌ఫ్రెండ్స్.. గిఫ్ట్‌ల కోసం బ్యాంకుకే కన్నం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *