Ktr: బుల్డోజ‌ర్ల‌కు అడ్డుగా నిల‌బడుతాం

సీఎం రేవంత్ రెడ్డి పంపే బుల్డోజ‌ర్ల‌కు అడ్డుగా నిల‌బడుతామ‌ని బి ఆర్ ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు.తెలంగాణ భ‌వ‌న్‌లో జీహెచ్ఎంసీ ప‌రిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల‌తో స‌మావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూన‌ది ప‌రివాహ‌క ప్రాంతాల్లో నివ‌సించే పేద ప్ర‌జ‌లు ఎవ‌రూ ఆందోళ‌న‌కు గురికావొద్ద‌ని, అండ‌గా ఉంటామ‌ని చెప్పారు.

మూసీ సుందీర‌క‌ర‌ణ‌, హైడ్రా ఏదైనా కావొచ్చు.. ఏదైనా స‌రే.. నిర్దిష్ట‌మైన ఆలోచ‌న, ప‌ద్ధ‌తి, ప్ర‌ణాళిక లేదన్నారు. హైడ్రాను బిల్డ‌ర్ల‌ను, పెద్ద పెద్ద వ్యాపార‌వేత్త‌ల‌ను బ్లాక్ మెయిల్ చేసి, బెదిరించి వ‌సూళ్లు చేయ‌డానికి వాడుతున్నార‌ని ఆరోపించారు.హైద‌రాబాద్ న‌గ‌రంలో వంద శాతం సీవ‌రేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు పూర్తయ్యాయన్నారు.

కొన్ని చివ‌రి ద‌శ‌లో ఉన్నాయని చెప్పారు. గ‌త ప్ర‌భుత్వాలు చేయ‌లేని ప‌నిని కేసీఆర్ చేశారని చెప్పారు. కొత్త‌గా ఎస్టీపీల కోసం ఖ‌ర్చు పెట్టాల్సిన అవ‌స‌రం లేదని మూసీ పేరిట జ‌రుగుతున్న దోపిడీని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్తామన్నారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *