Krushna Rever:ఈ ఏడాది ముందస్తుగానే కృష్ణమ్మ పరుగులు పెడుతున్నది. ఇప్పటికే శ్రీశైలం రిజర్వాయర్ నిండేందుకు సమీపించగా, సాగర్‌కు వరద పరుగు పెడుతున్నది. ఎగువన ఉన్న జూరాల ప్రాజెక్టు నిండి 14 గేట్ల నుంచి వరదను దిగువకు వదులుతున్నారు. దీంతో శ్రీశైలానికి వడివడిగా వరద నీరు వచ్చి చేరుతున్నది. దీంతో శ్రీశైలం రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరువలో ఉన్నది.
Krushna Rever:శ్రీశైలం ప్రాజెక్టులోకి ప్రస్తుతం 76,841 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నది. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 875.9 అడుగులకు చేరుకున్నది. నీటి నిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా, 167.88 టీఎంసీల నీరు ఉన్నది. కుడి, ఎడమ జల విద్యుత్తు కేంద్రాల ద్వారా విద్యుదుత్పత్తి చేస్తూ, 58,578 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.
Krushna Rever:నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా నీటితో కళకళలాడుతున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 584 అడుగులకు చేరింది. నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 295 టీఎంసీలకు చేరింది. ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహం కారణంగా ప్రాజెక్టు 4 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
Krushna Rever:వాస్తవంగా గత దశాబ్దకాలంగా ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకునేవి. ఆ తర్వాతే సాగునీటిని విడుదల చేసేవారు. అయితే ఈసారి మాత్రం జూలైలోనే నిండుకుండల్లా మారడంతో ఆయకట్టు రైతుల్లో ఆశలు చిగురించాయి. ఇప్పటికే సాగర్ ఎడమ కాల్వకు నీటిని విడుదల చేయడంతో నల్లగొండ, ఖమ్మం జిల్లా రైతులు నార్లు పోసుకునే పనుల్లో బిజీగా ఉన్నారు.