Konda Surekha: రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఇంటిలో తీవ్ర విషాదం అలుముకున్నది. ఆమెతో సహా ఆమె కుటుంబ సభ్యులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. ఓ దశలో మంత్రి విలపిస్తూ కన్నీరు మున్నీరయ్యారు. ఆమె ఇంటిలో పెంపుడు కుక్క చనిపోవడంతో ఈ విషాదఛాయలు అలుముకున్నాయి. కుక్క ఆ ఇంటిలో ఒక మనిషి వలే తోడుగా ఉంటుందని అక్కడి సిబ్బంది కూడా ఆవేదనతో చెప్పారు.
Konda Surekha: మంత్రి కొండా సురేఖ పెంపుడు కుక్క హ్యాపీ గురువారం (మార్చి 6న) అనారోగ్యంతో చనిపోయింది. ఆ శునకానికి మంత్రి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. హ్యాపీ మృతదేహంపై పూలు చల్లి మొక్కుకున్నారు. హ్యాపీ అంటే తనకెంతో ఇష్టమని, అది లేకుంటే తనకు ఏదీ తోచదని మంత్రి చెప్పడం బాధాకరం.
Konda Surekha: ఏదైతేనేమి కానీ, పెంపుడు జంతువులు మనుషులతో మరుపురాని అనుబంధం పెంచుకుంటాయనడానికి కొండా సురేఖ హ్యాపీ (శునకం) ఒక ఉదాహరణ. హ్యాపీ మరణంతో ఒక మనిషి వెళ్లిపోయినంతగా ఆ కుటుంబం బాధపడటం విషాదకరం. ఎంతగా ఆ ఇంటితో బంధాన్ని పెనవేసుకున్నదో తెలుస్తున్నది.
Konda Surekha: ఏఐసీసీ అగ్రనాయకురాలు సోనియాగాంధీ నుంచి ప్రశంసలు అందుకున్న మరునాడు మంత్రి కొండా సురేఖ ఇంటిలో ఈ విషయాం నెలకొన్నది. దక్షిణ కాశీగా పేరొందిన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ఆలయంలో మంత్రి కొండా సురేఖ చొరవతో మహాకుంభాభిషేకం నిర్వహించడాన్ని ఆమె అభినందించారు.