Komtireddy venkatreddy: బీసీ కులగణన జరగాలన్న హామీకి తామంతా కట్టుబడి ఉన్నామని మంత్రి కోమటరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.బీసీ కుల గణన తెలంగాణ లో చరిత్ర సృష్టించబోతోందని తెలిపారు.రైతు రుణమాఫీ గురించి మాట్లాడే కనీస అర్హత హరీశ్‌రావు కు లేదని ఆయన మండిపడ్డారు. స్పష్టం చేశారు. రాష్ట్రంలో విపక్షాలు కేవలం ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవాళ గాంధీభవన్ లో కుల గణనపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన నిర్వహిస్తున్న సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ, మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.