Karnataka: కర్ణాటకలోని ముడా మనీలాండరింగ్ కేసులో మాజీ ముడా కమిషనర్ నటేష్ ఇంటిపై ఈడీ దాడులు చేసింది. విచారణ అనంతరం ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ముడా కమిషనర్‌గా ఉన్నప్పుడు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య భార్య పార్వతికి నటేష్ అక్రమంగా భూములు కేటాయించారని ఆరోపణలు వచ్చాయి.
ఇది కూడా చదవండి: Darshan: కన్నడ నటుడు దర్శన్‌కు మధ్యంతర బెయిల్
Karnataka: విచారణలో, ఆ సమయంలో తాను అన్ని ప్రభుత్వ ఆదేశాలను పాటించానని, కేటాయింపులో ఎలాంటి తప్పు చేయలేదని నటేష్ చెప్పినట్లు తెలిసింది. అంతకుముందు అక్టోబర్ 28న, కర్ణాటకలోని ముడాకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో మంగళూరు, బెంగళూరు, మాండ్య, మైసూర్‌లోని 6కి పైగా ప్రాంతాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది.