Horoscope Today:
మేషం (Aries)
మీకు ఈరోజు అదృష్టం కలిసి వస్తుంది. దీర్ఘకాలంగా వేధిస్తున్న ఒక సమస్యకు పరిష్కారం లభిస్తుంది. అవసరమైన సమయంలో తోటివారి సహకారం అందుతుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది.
-
పరిహారం: హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మనోధైర్యం పెరుగుతుంది.
వృషభం (Taurus)
వృత్తి, ఉద్యోగాల్లో మీరు పెట్టుకున్న లక్ష్యాలను సులువుగా చేరుకుంటారు.పై అధికారుల మద్దతు మీకు లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.
-
పరిహారం: దుర్గాదేవిని ధ్యానించడం శ్రేయస్కరం.
మిథునం (Gemini)
మీ దృష్టిని లక్ష్యం వైపు కేంద్రీకరిస్తేనే ఆశించిన ఫలితాలు వస్తాయి.వ్యాపార విషయాల్లో సొంత నిర్ణయాల కంటే అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం మంచిది. శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండండి.
-
పరిహారం: నవగ్రహ ఆరాధన శుభప్రదం.
కర్కాటకం (Cancer)
ఉద్యోగంలో ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది, కష్టపడితేనే ఫలితం దక్కుతుంది.కుటుంబ సభ్యులతో చిన్నపాటి మనస్పర్థలు రావచ్చు. అధికారులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి.
-
పరిహారం: దుర్గాదేవి దర్శనం మానసిక శాంతిని ఇస్తుంది.
సింహం (Leo)
పనులను వాయిదా వేయకుండా ముందస్తు ప్రణాళికతో సాగండి.సమస్యలు క్రమంగా తగ్గుముఖం పడతాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు.
-
పరిహారం: శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం శుభప్రదం.
కన్య (Virgo)
పనుల్లో కొంత జాప్యం కలిగే సూచనలు ఉన్నాయి. మీ శ్రమకు తగిన గుర్తింపు కోసం మరింత కష్టపడాలి.అధికారులతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్త అవసరం.
-
పరిహారం: విష్ణుసహస్రనామ పారాయణ మేలు చేస్తుంది.
తుల (Libra)
మీ సంకల్ప బలం మిమ్మల్ని విజయ తీరాలకు చేరుస్తుంది. స్థానచలనం లేదా ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ప్రయాణాల్లో వస్తువుల పట్ల జాగ్రత్త వహించండి.
-
పరిహారం: సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మేలు చేస్తుంది.
వృశ్చికం (Scorpio)
ఈరోజు మీకు అన్ని విధాలా అనుకూలంగా ఉంది. స్పష్టమైన ఆలోచనలతో ముందడుగు వేయండి. మీ ఇంట్లో శుభవార్త వినే అవకాశం ఉంది. తోటివారి సహకారం లభిస్తుంది.
-
పరిహారం: శివారాధన శుభ ఫలితాలనిస్తుంది.
ధనుస్సు (Sagittarius)
సహచరుల సహకారంతో పనులు పూర్తవుతాయి. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. కుటుంబంలో చిన్నపాటి విభేదాలు వచ్చే ఛాన్స్ ఉంది, సర్దుకుపోవడం మంచిది.
-
పరిహారం: దుర్గాస్తోత్ర పఠనం మంచిది.
మకరం (Capricorn)
మీ కీర్తిప్రతిష్ఠలు పెరుగుతాయి. అభివృద్ధికి సంబంధించిన వార్తలు వింటారు.బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. అయితే, ఆరోగ్య విషయంలో కొంచెం శ్రద్ధ అవసరం.
-
పరిహారం: సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం పఠించడం శ్రేయస్కరం.
కుంభం (Aquarius)
సమాజంలో మీకు గౌరవమర్యాదలు పెరుగుతాయి. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు.కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి.
-
పరిహారం: దైవారాధనను కొనసాగించండి.
మీనం (Pisces)
మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. మనసు ఉల్లాసంగా ఉంటుంది.బంధువుల రాక ఆనందాన్నిస్తుంది. ఉత్తమమైన భోజన సౌఖ్యం లభిస్తుంది.
-
పరిహారం: ఇష్టదైవ ప్రార్థన శుభప్రదం.
