KL Rahul: దసరా కానుకగా విడుదలైన రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన ‘కాంతారా చాప్టర్ 1’ చిత్రం ప్రేక్షకుల మన్ననలు పొందుతోంది. కేవలం అభిమానులే కాదు, సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు ప్రశంసలు పొందుతుంది. తాజాగా టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ కె.ఎల్. రాహుల్ ఈ సినిమా చూసి ఫిదా అయ్యారు.
తాజాగా రాహుల్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ‘కాంతారా చాప్టర్ 1’ చూసిన తర్వాత తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఈ సినిమా అసాధారణం. రిషబ్ శెట్టి మరోసారి తన ప్రతిభతో మంత్ర ముగ్ధుడిని చేశాడు. మంగుళూరు ప్రజల విశ్వాసం, సంస్కృతిని తెరపై అద్భుతంగా చూపించారు అంటూ రాశారు. ఆయన పోస్ట్‌ను చూసి చిత్ర బృందం ఎంతో ఆనందం వ్యక్తం చేసింది. ఇది మా టీమ్‌కి ఒక విన్నింగ్ మూమెంట్ లాంటిది అని స్పందిస్తూ, రాహుల్‌కు ధన్యవాదాలు తెలిపారు.
రాహుల్ గతంలో కూడా ‘కాంతారా’ సినిమా తనకు ఎంతో ఇష్టమని పేర్కొన్నారు. మ్యాచ్ గెలిచిన తర్వాత తన విక్టరీ సెలబ్రేషన్ కూడా ఆ సినిమాలోని స్ఫూర్తితో చేశానని ఆయన వెల్లడించారు. నేను ఆ ప్రాంతంలో ఆడుతూ పెరిగాను, అందుకే ఆ భావనతో సెలబ్రేట్ చేశాను అని రాహుల్ చెప్పారు.
Also Read: Tron Ares: ట్రాన్: ఆరెస్ విడుదలకు రెడీ.. AI యుగంలో సరైన సినిమా!
ప్రస్తుతం వెస్టిండీస్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో అద్భుత ఫార్మ్‌లో ఉన్న రాహుల్, మ్యాచ్‌ల మధ్యలో సమయం దొరికితే మంచి సినిమాలు చూసి ప్రశంసించడం తన ప్రత్యేకతగా మార్చుకున్నాడు. గతంలో ‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్ చేసిన “తగ్గేదేలే” స్టైల్‌కి క్రికెట్ ప్రపంచం ఫిదా అయినట్లు తెలిసిందే. ఆ ప్రభావం రాహుల్‌తో సహా చాలామంది క్రికెటర్లలో కనిపించింది. ఇప్పుడు రాహుల్ ‘కాంతారా చాప్టర్ 1’ను ప్రశంసించడం సినిమాపై మరింత హైప్ తెచ్చిపెడుతోంది.
రిషబ్ శెట్టి దర్శకత్వం, నటన, స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు బలంగా నిలిచాయి. అలాగే అజనీష్ లోకనాథ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు ఆధ్యాత్మిక వైబ్స్‌ను జోడించింది. ఇప్పటికే సినిమాలోని విజువల్స్, మ్యూజిక్, డివోషనల్ ఎలిమెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొత్తానికి, ‘కాంతారా చాప్టర్ 1’ ప్రభావం ఇప్పుడు క్రికెట్ మైదానాలకూ చేరింది. స్టార్ క్రికెటర్ కె.ఎల్. రాహుల్ లాంటి వ్యక్తి నుంచి వచ్చిన ప్రశంసలు ఈ సినిమాను ఇంకా ఎక్కువ మందికి చేరేలా చేశాయి.