Kishan Reddy

Kishan Reddy: 10% రిజర్వేషన్లు రద్దు చేస్తే.. బీసీ రిజర్వేషన్ల బాధ్యత నేనే తీసుకుంటా

Kishan Reddy: తెలంగాణ రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. బీసీ రిజర్వేషన్ల అంశంపై బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గురువారం ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముస్లింలకు ఇచ్చే 10% రిజర్వేషన్లు రద్దు చేస్తే, బీసీలకు వచ్చే బాధ్యతను తానే స్వీకరించేందుకు సిద్ధమన్నారు.

రేవంత్‌పై నిప్పులు చెరిగిన కిషన్ రెడ్డి

రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతూ..“తన స్థాయికి మించి మాట్లాడుతున్నారు. ప్రధాని మోదీని ‘లీగల్లీ కన్వర్టెడ్ బీసీ’ అంటారా? రేపు లంబాడాలను కూడా కన్వర్టెడ్ ఎస్టీ అంటారా?” అంటూ ప్రశ్నించారు.

అలాగే రేవంత్‌ను “కన్వర్టెడ్ కాంగ్రెస్ నాయకుడు”గా పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ మజ్లిస్ కనుసన్నల్లో పనిచేస్తోందని ఆరోపించారు.
“ఇలాగే సాగితే ఓవైసీ కుటుంబానికే సీఎం పదవి ఇవ్వాల్సి వస్తుంది” అన్నారు.

మతపరమైన రిజర్వేషన్లపై తీవ్ర అభ్యంతరం

మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని, అవి దేశంలో గొడవలకు దారితీయవచ్చని హెచ్చరించారు.
తెలంగాణ హైకోర్టు గతంలో ముస్లింలకు ఇచ్చిన 4% రిజర్వేషన్లను కూడా రద్దు చేసిందని గుర్తు చేశారు.
“ముస్లింలకు బీసీ రిజర్వేషన్లు ఎలా ఇస్తారు? తీసేస్తే బీసీలకు న్యాయం చేస్తా. రాష్ట్రపతి, ప్రధాని వరకు వెళ్లి మాట్లాడతా” అని స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: Rajasthan Royals: సంజు శాంసన్‌ను వదులుకోం

GHMCలో ముస్లింలే గెలవడం ద్వారా బీసీలకు వెన్నుపోటు

GHMC ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల కింద ఎక్కువగా ముస్లింలే గెలిచారని విమర్శించారు.
“50 రిజర్వుడ్ సీట్లలో 31 చోట్ల ముస్లింలే గెలిచారు. ఈ విధంగా బీసీలకు రాజకీయ అధికారం దక్కే అవకాశం తగ్గుతోంది” అని చెప్పారు.

కాంగ్రెస్ బీసీలకు న్యాయం చేయడం లేదన్న ఆరోపణలు

కామారెడ్డి డిక్లరేషన్‌లో కాంగ్రెస్ పార్టీ బీసీల కోసం రూ.లక్ష కోట్లు ఖర్చు చేస్తామన్నా ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని అన్నారు.

“ఏ ఒక్క బీసీ వర్గాన్ని మినహాయించకుండా అందరినీ మోసం చేశారు” అని విమర్శించారు. “GHMCలో నాన్-బీసీలే బీసీ సీట్లలో గెలిచారు. బీసీలను మోసం చేయడంలో తెలంగాణ మోడల్ అయింది” అన్నారు.

ఢిల్లీ ధర్నా పై ఎద్దేవా

జంతర్ మంతర్ లో జరిగిన కాంగ్రెస్ ధర్నా గాంధీ కుటుంబాన్ని గొప్పగా చూపించేందుకే అని విమర్శించారు. “రేవంత్ రెడ్డి దిల్లీ వచ్చి డ్రామాలు చేస్తున్నారు. రాహుల్, సోనియాల జపంతో ఏం లాభం?” అని ప్రశ్నించారు. “42% బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెసే బాధ్యత తీసుకోవాలి. న్యాయపరమైన మార్గంలో పోరాడాలి” అని సూచించారు.

కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందన

తెలంగాణ మంత్రి కొండా సురేఖ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని పేర్కొన్నారు. “సోనియాగాంధీ వెంటనే క్షమాపణలు చెప్పాలి” అని డిమాండ్ చేశారు.

ALSO READ  Delhi: న్యూఢిల్లీలో భూప్రకంపనలు… హర్యానాలో మరోసారి భూకంపం

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *