Kishan Reddy: యూరియా బ్లాక్ మార్కెట్‌పై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుకు రూ.260కి అందాల్సిన యూరియా, బ్లాక్ మార్కెట్లో రూ.400కి అమ్మబడుతోందని ఆయన ఆరోపించారు.
“యూరియాపై కేంద్రం రూ.2,200 నుంచి రూ.2,400 వరకు సబ్సిడీ ఇస్తోంది. కానీ రైతు తగిన ధరకే ఎరువులు పొందడం లేదు. బ్లాక్ మార్కెట్లో యూరియా ఎలా దొరుకుతుందో కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలి” అని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు.
రైతుల ప్రయోజనాల కోసం కేటాయించిన సబ్సిడీ, మధ్యవర్తుల చేతుల్లోకి వెళ్లిపోకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.