Kiran Abbavaram: దీపావళి కానుకగా విడుదలైన ‘క’ చిత్రంతో కిరణ్ అబ్బవరం చక్కని విజయాన్ని అందుకున్నాడు. దాంతో అతని నెక్ట్స్ ప్రాజెక్ట్ పై అందరి దృష్టి పడింది. ఇప్పటికే శివమ్ సెల్యులాయిడ్స్, ఏ యూడ్లీ ఫిలిమ్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రంలో కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్నాడు. ఇందులో రుక్సార్ థిల్లాన్ కథానాయిక. విశ్వ కరుణ్ దీనికి డైరెక్టర్. గురువారం ఈ సినిమా టైటిల్ ను మేకర్స్ ప్రకటించారు. దీనికి ‘దిల్ రుబా’ అనే పేరు ఖరారు చేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. కిరణ్ అబ్బవరం యూనిక్ స్టైల్ లో, యాటిట్యూడ్ తో ఇందులో కనిపిస్తున్నారు. హిజ్ లవ్, హిజ్ యాంకర్’ అనే కొటేషన్ ను పోస్టర్ లో పెట్టారు. లవ్, రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ‘దిల్ రుబా’ ఉండబోతోంది. సామ్ సీఎస్ సంగీతాన్ని అందిస్తున్న ఈ మూవీ వచ్చే యేడాది ఫిబ్రవరిలో విడుదల కానుంది. మరి ‘క’ స్థాయి విజయాన్ని ‘దిల్ రుబా’ కూడా అందుకుంటుందో లేదో చూడాలి.
Roshan Kankala: ‘మోగ్లీ 2025’ టైటిల్ తో రోషన్ కనకాల!
Roshan Kankala: తొలి చిత్రం ‘కలర్ ఫోటో’తో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ అవార్డును అందుకున్నాడు యువ దర్శకుడు సందీప్ రాజ్. అలానే ‘బబుల్ గమ్’ మూవీతో చక్కని పెర్ఫార్మర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో రోషన్ కనకాల. వీరిద్దరి కాంబినేషన్ లో ‘మోగ్లీ 2025’ అనే సినిమాను టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ కాంటెంపరరీ లవ్ స్టోరీ పూజా కార్యక్రమాలతో మొదలైంది. ఈ సినిమాతో సాక్షి సాగర్ మదోల్కర్ హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం అవుతోంది. రోషన్ కనకాల, సాక్షి సాగర్ మదోల్కర్లపై చిత్రీకరించిన ముహూర్తం సన్నివేశానికి సందీప్ రెడ్డి వంగా క్లాప్ ఇచ్చారు. ‘దసరా’ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కెమెరా స్విచాన్ చేశారు. నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ స్క్రిప్ట్ను దర్శకుడికి అందజేశారు. వచ్చే నెలలో రెగ్యులర్ షూటింగ్ను ప్రారంభించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి కాలభైరవ సంగీతం అందిస్తున్నారు.