Kiara Advani: బాలీవుడ్ సీనియర్ నటీనటుల బయోపిక్స్ పై అక్కడ దర్శక నిర్మాతలు దృష్టి పెట్టారు. ఇటీవల నట, గాయకుడు కిశోర్ కుమార్ బయోపిక్ ను తీయబోతున్నట్టు భూషణ్ కుమార్ ప్రకటించారు. బాలీవుడ్ స్టార్ హీరో ఆమీర్ తో కిశోర్ కుమార్ పాత్ర చేయించాలని ఉందంటూ మనసులో మాట చెప్పారు. అలానే అలనాటి నటి మీనాకుమారి జీవితాన్ని ‘కమల్ ఔర్ మీనా’ పేరుతో తెరకెక్కించబోతున్నట్టు ఇప్పటికే సిద్ధార్థ్ పి. మల్హోత్రా తెలిపారు. ఈ ప్రకటన వచ్చిన సమయంలో మీనాకుమారిగా కృతి సనన్ నటించబోతోందనే వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఆమె స్థానంలో కియారా అద్వానీ పేరు వినిపిస్తోంది. మీనా కుమారి ప్రేమగాథ ఆధారంగా తెరకెక్కే ఈ సినిమాకు కియారానే బెటర్ ఆప్షన్ అని మేకర్స్ భావిస్తున్నారట. కియారా అద్వానీ ప్రస్తుతం ‘డాన్ -3’, ‘వార్-2’ చిత్రాలతో పాటు తెలుగులో రామ్ చరణ్ సరసన ‘గేమ్ ఛేంజర్’లో నటిస్తోంది. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కానుంది.

