Khammam: ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం పరిధిలో దారుణం చోటుచేసుకున్నది. నేలకొండపల్లి మండల కేంద్రంలో భార్యాభర్తలను గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భయాందోళన కలిగించేలా జరిగిన ఈ ఘటనపై విచారణ కొనసాగుతున్నదని పోలీసులు తెలిపారు.
Khammam: నేలకొండపల్లి మండల కేంద్రంలో రమణ, కృష్ణకుమారి అనే వృద్ధ దంపతులు తమ ఇంటిలోనే నివాసం ఉంటున్నారు. వారి పిల్లలు హైదరాబాద్‌లో ఉంటున్నారు. అయితే మంగళవారం అర్ధరాత్రి దాటాక దుండగులు వారి ఇంటిలోకి చొరబడ్డారు. రమణ, కృష్ణకుమారి దంపతులను గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేసి, ఇంటి చుట్టూ కారం చల్లి వెళ్లారు.
Khammam: ఒంటిరిగా ఉంటున్న వృద్ధ దంపతుల ఇంటిలో నగదు, నగల కోసమే దుండగులు దూరి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. ఏదో జరగడంతో వారిని హతమార్చినట్టు చెప్పుకుంటున్నారు. తెలిసిన వారి పనేనా? లేక వేరే ప్రాంతం నుంచి వచ్చిన దుండగులు అయి ఉంటారా? అన్నది తేలాల్సి ఉన్నదని పోలీసులు తెలిపారు.