US Bribery Case

US Bribery Case: FBIకి అడ్డంగా బుక్కైన జగన్.. మహాన్యూస్ చేతికి కీలక డాక్యుమెంట్స్!

US Bribery Case: అదానీపై అమెరికాలో నమోదైన కేసు విషయంలో లింక్స్ ఆంధ్రప్రదేశ్ గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చుట్టూ బిగుసుకుంటున్నాయి. గ్రీన్ ఎనర్జీ విషయంలో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారాయని అమెరికాలో అదానీ కంపెనీపై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. లంచాలు ఇవ్వడం కోసం అమెరికా పెట్టుబడిదారుల డబ్బును దారిమళ్లించారని అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్బీఐ సహా ఇతర సంస్థలు ఆరోపించాయి. అయితే, ఆంధ్రప్రదేశ్ తో ఒప్పందం చేసుకోవడం కోసం లంచాలు ఇచ్చారనేది ఈ ఆరోపణల్లో కీలకంగా మారింది. ఒడిశాతోనూ ఒప్పందం కుదుర్చుకోవడానికి లంచం ఇచ్చినా.. ఏపీకి ఇచ్చిన లంచం చాలా ఎక్కువగా ఉందనేది విస్మయం కలిగిస్తోంది. 

US Bribery Case: ఇప్పుడు ఈ కేసుకు సంబంధించిన కీలక డాక్యుమెంట్స్ మహాన్యూస్ చేతికి వచ్చాయి. 41 పేజీల US SEC రిపోర్ట్‌ మహాకు చిక్కింది. ఆ డాక్యుమెంట్స్ ప్రకారం.. 

  • వైఎస్‌ జగన్‌ అవినీతిని అమెరికా దర్యాప్తు సంస్థ FBI గుర్తించినట్లు స్పష్టం అవుతోంది. SECI ప్రకటన ప్రకారం 2021 జూలైలో SECI తన మొదటి  మాన్యుఫ్యాక్చరింగ్ లింక్డ్ ప్రాజెక్టులకు సంబంధించి 500 మెగావాట్ల పవర్ సప్లై ఒప్పందాన్ని ఒడిశా గ్రిడ్ కార్పొరేషన్‌తో కుదుర్చుకుంది
  • 2021 ఆగస్టులో, గౌతమ్ అదానీ అప్పటి సీఎం జగన్‌తో వ్యక్తిగతంగా సమావేశమై SECIతో ఏపీ ఒప్పందం కుదుర్చుకోకపోవడంపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్  ఒప్పందం చేసుకునేలా చేయడానికి అవసరమైన ప్రోత్సాహకాల గురించి గౌతమ్ అదానీ జగన్ తో మాట్లాడారు. 
  • ఆ సమావేశంలో గౌతమ్ అదానీ SECI ద్వారా 7,000 మెగావాట్ల విద్యుత్తు కొనుగోలుకు లంచాలు చెల్లించడం లేదా చెల్లిస్తానని వాగ్దానం చేశారు. ఒడిశా కు ఇచ్చిన లంచంతో పోలిస్తే, ఏపీకి లంచం అనేక రెట్లు ఎక్కువగా ఉంది. ఇది సుమారు రూ. 1600 కోట్లు ఉన్నట్లు వెల్లడైంది. 
  • ఈ లంచాల వివరాలు అదానీ గ్రీన్ సంస్థ అంతర్గత రికార్డులలోని లెక్కలతో అనుగుణంగా కూడా ఉన్నాయి. అదానీ, జగన్‌ సమావేశం తర్వాత అదానీ గ్రీన్, అజూర్‌ లోని అంతర్గత కమ్యూనికేషన్‌లు ఆంధ్రప్రదేశ్ SECI నుండి విద్యుత్తు కొనుగోలుకు అంగీకరించినట్లు చూపించాయి. 
  • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం SECIతో 7,000 మెగావాట్ల విద్యుత్‌ కొనుగోలుకు సూత్రప్రాయంగా అంగీకరించింది. ఏపీ కేబినెట్ సమావేశంలో SECI ఆఫర్‌ను ఆమోదించాలని నిర్ణయించినట్లు పబ్లిక్‌గా ప్రకటించింది. ఈ ఒప్పందం విషయంలో అప్పటి పెద్దలకు అందిన లంచాలు ప్రభావాన్ని చూపించినట్లు స్పష్టం అవుతోంది. 

US Bribery Case: మొత్తంగా చూసుకుంటే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి చేసిన పాపం ఇప్పుడు బద్దలు అయినట్టే కనిపిస్తోంది. ఈ కేసు విషయంలో నేరుగా ఎఫ్బీఐ దర్యాప్తు చేస్తుండడంతో ఇప్పుడు తరువాత ఏమి జరుగుతుంది అనేది ఆసక్తికరంగా మారింది. 

US Bribery Case: నిపుణుల అంచనా ప్రకారం కేసులో జగన్ పీకల్లోతులో ఇరుక్కున్నట్టే. అమెరికా చట్టాల ప్రకారం ఆయనపై దర్యాప్తు జరుగుతుంది. ఈ దర్యాప్తులో దొరికే ఆధారాల ఆధారంగా జగన్ మోహన్ రెడ్డి అరెస్ట్ తప్పకపోవచ్చు. మన దేశంలో లా యూఎస్ లో దర్యాప్తు నత్తనడకన సాగదు. వేగంగా జరిగిపోతుంది. అందువల్ల త్వరలోనే జగన్ మోహన్ రెడ్డి అమెరికా దర్యాప్తు సంస్థలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. 

మహాన్యూస్ చేతికి చిక్కిన 41 పేజీల డాక్యుమెంట్స్ లోని ముఖ్యమైన భాగాన్ని ఇక్కడ చూడొచ్చు . .

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *