Kapil Sharma: కెనడాలోని బ్రిటిష్ కొలంబియా సర్రేలో ప్రముఖ హాస్యనటుడు కపిల్ శర్మ ఇటీవల ప్రారంభించిన కాప్స్ కేఫ్‌పై బుధవారం రాత్రి దాడి జరిగింది. ఖలిస్థానీ ఉగ్రవాది హర్జిత్ సింగ్ లడ్డీ ఈ కాల్పులకు బాధ్యత వహిస్తూ సోషల్ మీడియాలో ప్రకటించాడు. కారులో నుంచి తొమ్మిది రౌండ్లు కాల్పులు జరిపిన ఈ ఘటన సీసీటీవీలో రికార్డైంది. అదృష్టవశాత్తూ ఎవరికీ గాయాలు కాలేదు. కాప్స్ కేఫ్ యాజమాన్యం ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందిస్తూ, రుచికరమైన కాఫీ, స్నేహపూర్వక వాతావరణంతో సంతోషాన్ని పంచాలనే లక్ష్యంతో కేఫ్‌ను ప్రారంభించామని, హింసకు వ్యతిరేకంగా గట్టిగా నిలబడతామని పేర్కొంది.
Also Read: Sri Vishnu: బ్లాక్ బస్టర్ దర్శకుడితో మరో సినిమాకి సిద్ధమైన శ్రీ విష్ణు?
సర్రే, డెల్టా పోలీసుల వేగవంతమైన స్పందనకు కృతజ్ఞతలు తెలిపింది. పోలీసులు, ఫోరెన్సిక్ బృందాలు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టాయి. కపిల్ శర్మ గతంలో నిహంగ్‌లపై చేసిన వ్యాఖ్యలే ఈ దాడికి కారణమని లడ్డీ పేర్కొన్నాడు. ఈ ఘటన స్థానిక భారతీయ సమాజంలో ఆందోళన కలిగించింది.