Kerala: కేరళలో విపరీత ఘటనలు కలకలం రేపింది. 16 ఏళ్ల ఓ మైనర్ బాలుడిపై 14 మంది లైంగికదాడికి పాల్పడ్డారు. ఒకరోజు రెండు రోజులు కాదు.. ఏకంగా రెండేళ్లపాటు ఈ తతంగం సాగుతూ వచ్చింది. అయితే ఆ బాలుడి తల్లికి అనుమానం వచ్చి అతన్ని నిలదీయడంతో ఈ బాగోతం బయటపడింది. జరిగిన విషయాలన్నింటినీ తన తల్లికి చెప్పడంతో నిందితులంతా పోలీస్ స్టేషన్ మెట్లెక్కాల్సి వచ్చింది. వీరిలో ప్రముఖులు కూడా ఉండటం గమనార్హం.
Kerala: కేరళలోని కాసరగోడ్‌కు చెందిన 16 ఏళ్ల బాలుడిపై సొంతూరుతోపాటు కన్నూరు, కోజికోడ్ తదితర ప్రాంతాల్లో లైంగికదాడి జరిగింది. రెండేళ్లపాటు 14 మంది ఈ దురాఘతానికి పాల్పడ్డారు. వారిలో ఒక రాజకీయ నేత, ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు, ఒక ఫుట్‌బాల్ కోచ్ ఉన్నారు. ఓ గే డేటింగ్ యాప్‌లో ఆ బాలుడితో ఆ నిందితులంతా స్నేహం పెంచుకున్నారు.
Kerala: ఆ బాలుడి ఇంటికి వచ్చిన ఓ వ్యక్తి హడావుడిగా పారిపోవడాన్ని చూసిన ఆ బాలుడి తల్లి నిలదీసింది. దీంతో జరిగిన విషయాలన్నింటినీ ఆ బాలుడు తన తల్లికి వివరించాడు. దీంతో తన కుమారుడిపై లైంగికదాడి జరిగిందని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోక్సో చట్టం కింద ఆ 14 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిలో 9 మందిని అరెస్టు చేశారు. నిందితులంతా 25 ఏళ్ల నుంచి 51 ఏళ్ల వయసున్న వారిగా గుర్తించారు.