KCR: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. నిన్నటి (ఆగస్టు 23) నుంచి ఈ రోజు వరకు ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆయన ఎర్రవల్లిలోని ఫాంహౌజ్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారు. వైద్యులను కూడా అక్కడికి రప్పించారు. కేసీఆర్ రక్తంలో షుగర్, సోడియం స్థాయిల్లో హెచ్చుతగ్గులు ఉన్నట్టు అక్కడికి వెళ్లిన ప్రత్యేక వైద్యులు గుర్తించారు. ఈ మేరకు ఆయనను హైదరాబాద్‌లోని ఆసుపత్రికి తరలించే యోచనలో ఉన్నట్టు సమాచారం.
KCR: ప్రత్యేక వైద్యుల బృందం కేసీఆర్‌కు ఎర్రవల్లి ఫాంహౌజ్‌లోనే వైద్య చికిత్సలు అందిస్తున్నట్టు సమాచారం. ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నట్టు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తున్నది. ఈ విషయం తెలియగానే కేసీఆర్ తనయుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి ఎర్రవల్లికి వెళ్లి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. తీవ్రతను బట్టి హైదరాబాద్ తరలించాలని భావిస్తున్నట్టు తెలుస్తున్నది.