KCR: జూబ్లీహిల్స్ నియోజకవర్గం సహా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఆ 10 నియోజకవర్గాల్లోనూ ఉప ఎన్నికలు రాబోతున్నాయి. ఉప ఎన్నికలకు సిద్ధంకావాలి.. అని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేల అనర్హతపై 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్‌కు సుప్రీం ధర్మాసనం సూచించిన నేపథ్యంలో కేసీఆర్ కీలక నేతలతో ఎర్రవల్లిలోని తన ఫాంహౌస్‌లో సమావేశమయ్యారు.
KCR: ఈ సందర్భంగా వారితో మాట్లాడుతూ 11 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ఖాయమని తేల్చి చెప్పారని సమాచారం. పార్టీ శ్రేణులను సిద్ధం కావాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. ఉప ఎన్నికల సన్నద్ధతతోపాటు బనకచర్ల ప్రాజెక్టు అంశాన్ని కూడా కేసీఆర్ ఈ సందర్భంగా ప్రస్తావించినట్టు సమాచారం.
KCR: బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకునేందుకు పోరాటానికి పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని ఇదే సమావేశంలో కేసీఆర్ పిలుపునిచ్చినట్టు సమాచారం. అసలు ప్రాజెక్టు గురించి వివరించడంతోపాటు ఆ ప్రాజెక్టు పర్యవసానం గురించి శ్రేణులకు అవగాహన కల్పించాలని ముఖ్య నేతలకు సూచించారని తెలిసింది. ఈ విషయంలో భవిష్యత్తు కార్యాచరణను కూడా చర్చించినట్టు సమాచారం.