KCR: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఎమ్మెల్సీ కవిత సస్పెన్షన్ వార్తతో రాష్ట్ర రాజకీయ వాతావరణం వేడెక్కిన నేపథ్యంలో, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో పార్టీ ముఖ్య నేతలతో అత్యవసర భేటీ నిర్వహించారు.
ఈ సమావేశానికి కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డి, వేముల ప్రసాద్, సంజయ్ తదితర నేతలు హాజరయ్యారు. కవిత సస్పెన్షన్ తర్వాత పార్టీ అంతర్గత పరిస్థితులు, భవిష్యత్ వ్యూహరచనపై ఈ సమావేశంలో చర్చించినట్టు సమాచారం.
సస్పెన్షన్ నిర్ణయం పార్టీకి కలిగించే ప్రభావం, ఆ నిర్ణయం తర్వాత వచ్చే రాజకీయ ప్రతికూలతలను ఎదుర్కొనే చర్యలపై కూడా ఈ కీలక సమావేశంలో చర్చ జరిగిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇకపై పార్టీ తీరుతెన్నులు ఎలా ఉండాలి, నేతలు ప్రజల్లోకి వెళ్లే విధానం, ప్రభుత్వంపై విమర్శలకు ఇచ్చే సమాధానాలు వంటి వ్యూహాలు కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది.
రాజకీయ విశ్లేషకులు ఈ సమావేశాన్ని, బీఆర్‌ఎస్‌లో ఏర్పడిన అంతర్గత సంక్షోభాన్ని అధిగమించే దిశగా వేసిన మొదటి అడుగుగా భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Kalvakuntla Kavitha: కవిత కీలక నిర్ణయం.. తండ్రి కి పోటీగా కొత్త పార్టీ..?
కవిత సస్పెండ్..
తెలంగాణ మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తన కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు, అంతర్గత విభేదాల కారణంగా నిన్న అనగా సెప్టెంబర్ 2, 2025న బీఆర్‌ఎస్ నుంచి సస్పెండ్ చేస్తూ అధికార నివేదిక విడుదల చేశారు. హరీష్‌రావు, సంతోష్‌కుమార్‌లపై అవినీతి ఆరోపణలు చేయడం, కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై వచ్చిన వివాదంలో పార్టీకి ప్రతికూలత కలిగించిందన్న అభిప్రాయం ఈ నిర్ణయానికి దారితీసింది. కవితకు మద్దతుగా తెలంగాణ జాగృతి కార్యకర్తలు ఆందోళనలు చేపట్టగా, కాంగ్రెస్, బీజేపీ వంటి ప్రతిపక్షాలు దీనిని కుటుంబ విభేదాల ప్రతిబింబంగా విమర్శించాయి. ఈ పరిణామం బీఆర్‌ఎస్‌లో జరుగుతున్న అంతర్గత కలహాలకు బలమైన సంకేతంగా మారింది.