Kavita: కేసీఆర్ ఫామ్ హౌస్ కి కవిత

Kavita: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపుతో శుక్రవారం ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో పార్టీ నేతల రద్దీ కనిపిస్తోంది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కుటుంబ సభ్యులతో కలిసి ఫామ్‌హౌస్‌కు చేరుకున్నారు. తన కుమారుడిని అమెరికాలోని కాలేజీలో చేర్పించేందుకు త్వరలో బయలుదేరనున్న కవిత, ఆ ప్రయాణానికి ముందుగా కుమారుడికి కేసీఆర్ ఆశీర్వాదం పొందేందుకు ఫామ్‌హౌస్‌కు వెళ్లారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు, ఎంపీ వినోద్‌ ఇప్పటికే ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌ను కలిశారు. కాసేపట్లో మంత్రి కేటీఆర్ కూడా చేరుకోనున్నారు. పార్టీ ప్రధాన నేతలు, కీలక కార్యకర్తలు కేసీఆర్ ఆహ్వానం మేరకు ఫామ్‌హౌస్‌కు వరుసగా వస్తున్నారు. ఈ సందర్భంగా పార్టీ భవిష్యత్ వ్యూహాలపై చర్చలు జరగనున్నట్లు సమాచారం.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *