KAVITA: బంజారాహిల్స్‌లో తెలంగాణ జాగృతి కొత్త కార్యాలయాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంటλα కవిత అధికారికంగా ప్రారంభించారు. ప్రారంభ కార్యక్రమం అనంతరం ఆమె భర్తతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో ప్రొఫెసర్ జయశంకర్, సీఎం కేసీఆర్, కవితల చిత్రాలు మాత్రమే ఉండగా, బీఆర్ఎస్కు చెందిన ఇతర ప్రముఖ నేతల ఫొటోలు లేకపోవడం ప్రత్యేక ఆసక్తిని కలిగిస్తోంది.
ఇదిలా ఉండగా, కవిత త్వరలోనే కొత్త రాజకీయ పార్టీని స్థాపించనున్నారని, ఆ పార్టీ జెండా పాలపిట్ట రంగులో (Rainbow colors) ఉండబోతుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇదే ప్రచారానికి అనుగుణంగా కవిత ఈరోజు నిర్వహించిన కార్యక్రమానికి అదే రంగు చీరలో హాజరుకావడం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ నేపథ్యంలో కవిత మరికాసేపట్లో మీడియాతో మాట్లాడనున్నారని సమాచారం. ఆమె వ్యాఖ్యలపై రాజకీయ వర్గాలు తీవ్ర ఆసక్తితో ఎదురుచూస్తున్నాయి.