Kavita: తెలంగాణ ఆర్టీసీ విద్యార్థులు మరియు జనరల్ బస్‌పాస్‌ల చార్జీలను ఇటీవల సుమారు 20 శాతం పెంచిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంతో ప్రజలు, విద్యార్థులు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బస్ భవన్ వద్ద్ద ఉద్రిక్త వాతావరణం చోట చేసుకుంది.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో బస్‌పాస్ ధరల పెంపును నిరసిస్తూ బస్ భవన్‌ను ముట్టడించేందుకు శాలంతి చేసారు. పెద్ద ఎత్తున జాగృతి కార్యకర్తలతో కలిసి బస్ భవన్ ఎదుట కవిత ధర్నాకు దిగారు. ఈ క్రమంలో ఘర్షణ వాతావరణం ఏర్పడటంతో పోలీసులు ఎమ్మెల్సీ కవితను బలవంతంగా అరెస్ట్ చేశారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కవిత, ఆర్టీసీ పెంచిన ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. బస్‌పాస్ ధరల పెంపుతో ప్రజలపై ప్రభుత్వం భారీ భారం మోపిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పెంపు వల్ల విద్యార్థులు, చిరుద్యోగులపై ఆర్థిక ఒత్తిడి పెరుగుతుందని, ప్రజలపై గుదిబండను మోపారని ఆవేదన వ్యక్తం చేశారు.