Kavita: బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్సీ కవిత జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు. “జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మేము ఎలాంటి స్టాండ్ తీసుకోలేదు. అందరి తెలంగాణ కావాలి, కొందరి తెలంగాణ మాత్రమే కావొద్దు అనే భావంతోనే మేము ముందుకు సాగుతున్నాం,” అని ఆమె స్పష్టం చేశారు.
పార్టీలోని అసంతృప్తి అంశంపై మాట్లాడిన కవిత, “బీఆర్‌ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు ఎందుకు పార్టీ మారారో నాకు తెలియదు. పార్టీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని నన్ను బయటకు పంపింది. ఆ తర్వాత నేను ఎమ్మెల్సీ పదవి, అలాగే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశాను. నా నిర్ణయానికి నేను కట్టుబడి ఉన్నాను,” అని అన్నారు.
కవిత వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఆమె భవిష్యత్ వ్యూహంపై అన్ని వర్గాల దృష్టి నిలిచింది.

