Jammu And Kashmir: జమ్మూ కాశ్మీర్‌లోని కాశ్మీరీ పండిట్ల దుకాణాలపై బుల్‌డోజర్‌లను ప్రయోగించారు. జమ్మూ డెవలప్‌మెంట్ అథారిటీ (జేడీఏ) జమ్మూ నగరంలోని ముత్తి క్యాంప్ సమీపంలో ఉన్న కాశ్మీరీ పండిట్‌ల డజను దుకాణాలను కూల్చివేసింది. ఈ దుకాణాలను మూడు దశాబ్దాల క్రితం కాశ్మీరీ పండిట్‌లు ఏర్పాటు చేసుకున్నారు.
ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే దుకాణాలను కూల్చివేశారని ప్రజలు అంటున్నారు. మా పరిస్థితి ఇప్పుడు మళ్ళీ 90వ దశకానికి వెనక్కి వెళ్ళిపోయింది అని వారు వాపోతున్నారు. గత మూడు రోజులుగా ప్రజలు ఈ విషయమై ఆందోళనలు చేస్తున్నారు. జేడీఏ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే మరోవైపు తమ భూముల్లోనే దుకాణాలు నిర్మించుకున్నారని జేడీఏ చెబుతోంది.
ఇది కూడా చదవండి: Defamation Notice: రాహుల్-ఖర్గే పై పరువు నష్టం దావా
ప్రజల ఆందోళనతో కమీషనర్ అరవింద్ కర్వాణి సంఘటనా స్థలాన్ని సందర్శించి బాధిత కుటుంబాలకు కొత్త దుకాణాలు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. ముత్తి క్యాంపు ఫేజ్-2లో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించేందుకు జేడీఏ టెండరు జారీ చేసినట్లు తెలిపారు. త్వరలో దుకాణాలు నిర్మించి బాధిత ప్రజలకు అందజేస్తామని చెప్పారు.