Karthika Masam: నాగుల చవితి..కార్తీకమాసం ప్రారంభమైన నాలుగోరోజే వస్తుంది. ఈ చవితి అనగానే పుట్టలో పాలుపోసే ముహూర్తం అని అంటారు. నాగుల చవితి, నాగుల పంచమి రోజు నాగేంద్రుడిని పూజిస్తే సకల రోగాలు తొలగిపోతాయని, దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుందని భక్తుల విశ్వాసం. నాగుపాము కనిపించకున్నా, నాగేంద్రుడిని తలుచుకొని పాలు, కోడిగుడ్లు, ప్రసాదం ఉంచి పూజిస్తారు. అదే నాగేంద్రుడు నిజరూపంలో కనిపిస్తే.. ఇదే జరిగిందిక్కడ.
Karthika Masam: నాగుల చవితిని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా భక్తులు అక్టోబర్ 25న ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. నెల్లూరు జిల్లా మనుబోలు చెర్లోపల్లి రైల్వేగేటు సమీపంలో ఉన్న విశ్వనాథ స్వామి ఆలయంలో పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి పూజలు నిర్వహిస్తూ వచ్చారు. అదే ఆలయ ప్రాంగణంలో శివలింగం కూడా ఉన్నది. భక్తులు పూజలు చేసుకునే సమయంలోనే ఓ అరుదైన, భక్తులు అచ్చెరువొందే ఘటన చోటుచేసుకున్నది.
Karthika Masam: భక్తులు శివాలయంలోని శివలింగాన్ని అభిషేకం చేస్తూ పూజలు చేస్తుండగా, రెండు నాగుపాములు ఎక్కడి నుంచి వచ్చాయో కానీ శివలింగంపైకి చేరి కుడి, ఎడమ వైపున చెరొకటి చేరాయి. పడగ విప్పి భక్తులకు నిజ దర్శనం కల్పించాయి. దీంతో భక్తులు పరవశించి పోయారు.
Karthika Masam: నాగేంద్రుడే ఇలా స్వయంగా వచ్చి తమ పూజలందుకుంటున్నాడని భక్తులు పరమానందం పొందారు. ఇదే సమయంలో అక్కడ ఉన్న పూజారులు కూడా నాగేంద్రుడికి నిర్వహించే వేదమంత్రాలను జపించడం విశేషం. ఈ ఘటన గురించి తెలిసిన స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ అరుదైన ఘటనను తిలకించారు. ఆ తర్వాత ఆ రెండు నాగుపాములు వెనుకవైపు పొదల్లోకి వెళ్లిపోయాయి.

