Retro: తమిళ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ మూవీ ‘రెట్రో’ మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ఈ చిత్రాన్ని యాక్షన్‌తో కూడిన లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌లు సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. సూర్య స్టైలిష్ లుక్స్, యాక్షన్ సీన్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. అయితే, ఈ సినిమా తొలుత సూపర్‌స్టార్ రజినీకాంత్ కోసం రూపొందిందని కార్తీక్ సుబ్బరాజ్ సంచలన విషయం వెల్లడించారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘రెట్రో’ కథను రజినీ కోసం ప్యూర్ యాక్షన్ జోన్‌లో రాశానని, కానీ సూర్యకు నెరేట్ చేసిన తర్వాత దాన్ని లవ్ స్టోరీగా మార్చినట్లు తెలిపారు. రజినీ కోసం రాసిన కథను ఆయనకు వినిపించారా? అని సూర్య కూడా ప్రశ్నించినట్లు కార్తీక్ వెల్లడించారు.
ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా, సంతోష్ నారాయణన్ సంగీతం సినిమాకి హైలైట్‌గా నిలిచింది. సూర్య అభిమానుల్లో ‘రెట్రో’పై పాజిటివ్ వైబ్స్ నెలకొన్నాయి. మరి, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి!