Karthi: తమిళ నటుడు కార్తికి షూటింగ్ సమయంలో ప్రమాదం జరిగిందని వార్త వెలువడింది. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్దార్ 2’ (Sardar 2), 2022లో విడుదలైన స్పై-యాక్షన్ థ్రిల్లర్ ‘సర్దార్’ సినిమాకు కొనసాగింపుగా రూపొందుతోంది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కర్ణాటకలో జరుగుతోంది. యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తుండగా కార్తికి గాయం అయ్యింది. వెంటనే చిత్రబృందం ఆయనను ఆస్పత్రికి తరలించగా, ప్రస్తుతం ఆయన ఆరోగ్యానికి ఎటువంటి ప్రమాదం లేదని తెలిసింది. అయితే, వైద్యులు ఆయనకు వారంపాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.
ఈ ఘటన వల్ల సినిమా షూటింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు సమాచారం. గమనించదగ్గ విషయం ఏమిటంటే, ఇదే సినిమా షూటింగ్‌లో ఇది కార్తికి జరిగిన రెండో ప్రమాదం.
సర్దార్ 2 చిత్రంలో కార్తితో పాటు రజిషా విజయన్, ఎస్జే సూర్య, మాళవిక మోహనన్, ఆషికా రంగనాథ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.