Karnataka news: టీమిండియా దిగ్గజ క్రికెటర్ అనిల్ కుంబ్లే రాజకీయాల్లోకి ప్రవేశించనున్నారా? కాంగ్రెస్‌తోనే ఆయన అరంగేట్రం చేయబోతున్నారా? కుంబ్లేను రాజ్యసభ ఎంపిగా పంపుతారా? అందుకే కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కలిసింది అందుకేనా? అన్న విషయాలు కావచ్చేమోనన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. ఆయన సమకాలీన క్రికెటర్లలో అజారుద్దీన్, సిద్దూ లాంటి కొందరు రాజకీయాల్లో వచ్చినా, సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ లాంటి వారు మాత్రం రాజకీయాలకు దూరంగానే ఉన్నారు. అయితే డీకే శివకుమార్‌తో సమావేశానికి ప్రాధాన్యం సంతరించుకున్నది.
Karnataka news: క్రికెట్ దిగ్గజం అనిల్ కుంబ్లేను తాను కలుసుకున్న విషయాన్ని డీకే శివకుమార్ తన ఎక్స్ వేదికగా పంచుకున్నారు. దేశానికి, కర్ణాటక రాష్ట్రానికి కుంబ్లే చేసిన సేవలను ఆయన ఆ పోస్టులో కొనియాడారు. దీనికి అనిల్ కుంబ్లే కూడా ప్రతిస్పందించారు. తనను కలిసేందుకు విలువైన సమయాన్ని వెచ్చించినందుకు కృతజ్ఞతలు అని రిప్లై ఇచ్చారు.
Karnataka news: కుంబ్లే, డీకే సమావేశం వెనుక ఉన్న కారణాలు తెలియరాలేదు. మరోవైపు వీరిద్దరి కలయికపై సోషల్ మీడియాలో మాత్రం రకరకాల వార్తలు గుప్పుమంటున్నాయి. కుంబ్లేను డీకే రాజకీయాల్లోకి ఆహ్వానించారని చెప్తున్నారు. త్వరలో ఆయన చేరబోతున్నారంటూ వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఇదే దశలో ఆయనను రాజ్యసభ ఎంపీగా పంపే అవకాశం ఉన్నదని తెలుస్తున్నది. ఈ ప్రతిపాదనను కూడా కుంబ్లే ముందు డీకే ఉంచారని తెలుస్తున్నది.
Karnataka news: అయితే కుంబ్లే మాత్రం ఇది వ్యక్తిగత సమావేశమని కొట్టిపారేశారు. రాజకీయ అంశాలు చర్చకు రాలేదని చెప్తున్నారు. డీకే కూడా ఆయా విషయాలను వెల్లడించలేదు. అయితే కుంబ్లే తన ఆలోచనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటానని, కొంత గడువు కావాలని అడిగినట్టు తెలుస్తున్నది. ఒకవేళ కుంబ్లే కనుక గ్రీన్ సిగ్నల్ ఇస్తే మాత్రం.. కాంగ్రెస్ తరఫున రాజ్యసభకు ఎంపీగా నామినేట్ చేస్తారని సమాచారం. దీనిపై ఊగిసలాట ఎంతవరకు ఉంటుందో వేచి చూడాలి మరి.