Viral News

Viral News: భార్యకి విడాకులు ఇచ్చిన భర్త.. పాలాభిషేకం చేసిన తల్లి

Viral News: సాధారణంగా పెళ్లి వేడుకలంటే ఎంత సందడి, ఎంత ఆనందం ఉంటుందో మనందరికీ తెలుసు. నూరేళ్ల బంధంగా భావించే వివాహ బంధంలోకి అడుగుపెట్టినప్పుడు సంబరాలు చేసుకుంటాం. కానీ… ఒక వ్యక్తి తన పెళ్లి బంధం తెంచుకుని, విడాకులు పొందినందుకు కేక్ కట్ చేసి, సంబరాలు చేసుకున్న వింత దృశ్యం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

కర్ణాటకకు చెందిన డీకే బిరాదర్ అనే వ్యక్తి తన విడాకులను సెలబ్రేట్ చేసుకున్న తీరు సోషల్ మీడియాలో మిలియన్ల వ్యూస్‌తో వైరల్ అవుతోంది. ఇది కేవలం ఒక వీడియో కాదు, వైవాహిక జీవితంలోని కఠిన సత్యాలను, ముఖ్యంగా మగవారు ఎదుర్కొంటున్న పరిస్థితులను కళ్లకు కట్టినట్లు చూపించిన ఒక సంచలనం.

ఇది కూడా చదవండి: Baahubali The Epic: భారీ ర‌న్‌టైమ్‌తో రాబోతున్న బాహుబలి: ది ఎపిక్‌

కొడుకుకి ‘పాలాభిషేకం’ చేసిన తల్లి!

ఈ వేడుకలో అత్యంత ఆశ్చర్యకరమైన ఘట్టం ఏమిటంటే.. విడాకులు పొందిన డీకే బిరాదర్‌కు అతని తల్లి పాలాభిషేకం చేయడం!

సాధారణంగా దేవాలయాల్లో దేవుడికి శుద్ధి కోసం పాలాభిషేకం చేస్తారు. కానీ ఇక్కడ, తన కొడుకు పాత జీవితంలోని ‘మంట’ నుండి విముక్తి పొంది, కొత్త జీవితాన్ని ఆరంభిస్తున్నందుకు తల్లి ఈ ‘శుద్ధి కర్మ’ నిర్వహించింది. నేలపై కూర్చున్న కొడుకుకు తల్లి స్వయంగా పాలతో స్నానం చేయించి, నూతన జీవితానికి స్వాగతం పలికింది.

 

View this post on Instagram

 

A post shared by Biradar DK (@iamdkbiradar)

‘హ్యాపీ డివోర్స్’ కేక్ కట్ చేసి… భరణం వివరాలు వెల్లడి!

పాలాభిషేకం తర్వాత డీకే బిరాదర్ కొత్త దుస్తులు, కొత్త షూ, కొత్త వాచీ ధరించి కొత్త లుక్‌లో మెరిశాడు. ఆ తర్వాత అసలు సెలబ్రేషన్ మొదలైంది.

ఆయన కట్ చేసిన కేక్ పై రాసిన విషయం ఇప్పుడు ఇంటర్నెట్‌ను షాక్‌కు గురిచేసింది. ఆ కేక్‌పై ‘హ్యాపీ డివోర్స్’, ‘విజయవంతమైన విడాకులు’ అని రాసి ఉండటమే కాకుండా… “120 గ్రాముల బంగారం, రూ. 1.8 లక్షల నగదు” అని భరణంగా చెల్లించిన వివరాలను కూడా ధైర్యంగా ప్రకటించాడు. పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నట్లు, తాను మాజీ భార్యకు ఈ మొత్తాన్ని చెల్లించినట్లు స్పష్టమవుతోంది.

కేక్ కట్ చేసి, తన తల్లికి తినిపించి, తాను కూడా ఆనందంగా తిన్న ఈ దృశ్యం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

“నేను ఒంటరిగా, సంతోషంగా, స్వేచ్ఛగా ఉన్నాను!”

ఈ వీడియోను డీకే బిరాదర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో (@iamdkbiradar) షేర్ చేస్తూ ఇచ్చిన క్యాప్షన్ అనేక మంది యువత మనసుల్లో మాటగా మారింది.

“120 గ్రాముల బంగారం, 18 లక్షల రూపాయల డబ్బును నేను తీసుకోలేదు… నేను ఇచ్చాను. ఇప్పుడు నేను ఒంటరిగా, సంతోషంగా, స్వేచ్ఛగా ఉన్నాను. నా జీవితం… నా పద్ధతులు నాకు ఉన్నాయి. దీంతోపాటు సంతోషం కూడా వచ్చింది” అని ఆయన ప్రకటించాడు.

నెటిజన్ల రియాక్షన్: టార్చర్ నుండి విముక్తి!

ఈ వీడియోపై నెటిజన్ల స్పందన ఆసక్తికరంగా ఉంది. చాలా వరకు పాజిటివ్ కామెంట్లు రావడం విశేషం.

  • “వీళ్ల సెలబ్రేషన్స్ చూస్తుంటే… అతని మాజీ భార్య అతన్ని ఎంత టార్చర్ పెట్టిందో అర్థమవుతోంది,” అని కొందరు కామెంట్ చేశారు.
  • “జీవితాంతం నరకంలో బతికే కంటే, ఇలా విడిపోయి హ్యాపీగా ఉండటమే ఉత్తమం,” అని మరికొందరు మద్దతు తెలిపారు.
  • “ఏ తల్లి అయినా కొడుకు విడాకులు తీసుకుంటే బాధపడుతుంది. కానీ ఈ తల్లి పాలాభిషేకం చేసిందంటే, ఆ కోడలు ఆ కుటుంబాన్ని ఎంతగా వేధించిందో అర్థమవుతుంది,” అంటూ చాలా మంది నెటిజన్లు ఆ తల్లి పట్ల సానుభూతి వ్యక్తం చేశారు.

ఏది ఏమైనప్పటికీ, “భార్య అర్థభాగం” అనే రోజులు పోయి, “ఆస్తిలో సగభాగం” అనే కాలం నడుస్తోందని, వివాహ బంధం పురుషులకు ఎంత ‘నూరేళ్ల మంట’గా మారుతోందో చెప్పడానికి ఈ విడాకుల వేడుక ఒక నిదర్శనంగా నిలిచింది. డీకే బిరాదర్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో ‘విడాకుల హీరో’గా ట్రెండింగ్ అయ్యారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *