Kantara Chapter 1 Trailer: 2022లో అంచనాలు లేకుండా విడుదలై సంచలన విజయాన్ని సాధించిన చిత్రం ‘కాంతార’. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లు అందుకొని పాన్ ఇండియా స్థాయిలో పేరు తెచ్చుకుంది. అదే విజయాన్ని మరల రిపీట్ చేయాలనే ఉద్దేశంతో హోంబలే ఫిలిమ్స్ భారీ బడ్జెట్‌తో ‘కాంతార చాప్టర్ 1’ని నిర్మిస్తోంది.
హీరో, దర్శకుడిగా రిషభ్ శెట్టి మళ్లీ తన సత్తాని చుపియడానికి సిద్ధమయ్యాడు. అక్టోబర్ 2న ఈ పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు ట్రైలర్‌ని ప్రభాస్ విడుదల చేశారు.
ట్రైలర్‌లో చూపించిన విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, పంజుర్లి సన్నివేశాలు గూస్‌బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. రిషభ్ శెట్టి స్క్రీన్ ప్రెజెన్స్ మరో లెవెల్‌లో ఉండగా, హీరోయిన్ రుక్మిణి వసంత్ అందం కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా చూపించారు.
మొదటి భాగంలో జరిగిన విషయాలను ఆవిష్కరించగా, ఈసారి మాత్రం ‘గతంలో ఏం జరిగిందీ.. ఆ రహస్యమేంటి’ అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ కథను ముందుకు తీసుకువెళ్తున్నట్లు స్పష్టమవుతోంది.
‘కాంతార’ మాదిరిగానే ఈ ప్రీక్వెల్ కూడా ఒక కల్చరల్ రూట్స్, డివైన్ పవర్, హ్యూమన్ ఎమోషన్స్ మేళవింపుతో నడవనుందని ట్రైలర్ క్లారిటీ ఇచ్చింది. అందుకే ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ ట్రైలర్ పై పాజిటివ్ బజ్ మొదలైంది.
ఇక ‘కాంతార చాప్టర్ 1’ సినిమా విడుదలకు ఇంకా కొద్ది రోజులే మిగిలి ఉండటంతో, ఫ్యాన్స్ లో ఉత్సాహం మరో లెవెల్‌లో ఉంది.ఈ సినిమా అక్టోబర్ 2 2025 నా విడుదల కానుంది.