Kamal Haasan: ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్‌హాసన్‌పై కర్ణాటక రాష్ట్ర హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇటీవల ఆయన చేసిన భాషా వ్యాఖ్యలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమిళ భాష నుంచే కన్నడ భాష పుట్టిందని ఆయన ఇటీవల చేసిన వ్యాఖ్యలపై న్యాయస్థానం తీవ్ర అభ్యంతరాలను వ్యక్తంచేసింది.
Kamal Haasan: మీరేమైనా చరిత్రకారుడా? ఏ ఆధారాలతో అలాంటి వ్యాఖ్యలు చేశారు? అంటూ కమల్‌హాసన్‌ను కర్ణాటక హైకోర్టు ప్రశ్నించింది. తమిళం నుంచే కన్నడ భాష పుట్టిందన్న ఆయన వ్యాఖ్యలపై ఇటీవల కన్నడ భాషాప్రియులు కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ మేరకు విచారణకు వచ్చిన ఆ కేసుపై కోర్టు స్పందించింది.
Kamal Haasan: త్వరలో కమల్‌హాసన్ నటించిన తగ్ లైఫ్ సినిమా విడుదల కానున్నది. ఈ నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలకు నిరసనగా తగ్లైఫ్ సినిమాను కర్ణాటకలో నిషేధం విధించాలని కూడా హైకోర్టు పలువురు కర్ణాటక రాష్ట్ర ప్రజలు పిటిషన్ దాఖలు చేశారు. ఆ రెండు అంశాలపై న్యాయస్థానం విచారించింది.
Kamal Haasan: తమిళ భాష నుంచే కన్నడ భాష పుట్టిందని ఏ ఆధారాలతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని, ఒక్క క్షమాపణ చెబితే విషయం సద్దుమణుగుతుందని కర్ణాటక హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇప్పటికే కర్ణాటక ప్రజలు ఎందరో బహిరంగంగానే కమల్‌హాసన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే తాను ఏ తప్పూ చేయలేదని, తాను క్షమాపణ చెప్పబోనని తేల్చి చెప్పారు. అయితే కోర్టు కీలక వ్యాఖ్యలతో ఆయన స్పందన ఎలా ఉండబోతుందో వేచి చూడాలి. ఇప్పటికే వివిధ చోట్ల ఆయన వ్యాఖ్యలపై కర్ణాటకలోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు కూడా నమోదయ్యాయి.