Bigg Boss 9: బిగ్ బాస్ హౌస్‌లో ఈ సీజన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన కామనర్ కంటెస్టెంట్ కళ్యాణ్ పడాల. అగ్నిపరీక్షలో తన ప్రతిభను చాటుకొని హౌస్‌లోకి అడుగుపెట్టిన ఆయన, సైనికుడిగా తన కఠిన క్రమశిక్షణతో గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ బిగ్ బాస్ హౌస్‌లో మాత్రం కళ్యాణ్ తన గేమ్ కంటే ఎక్కువగా హౌస్‌మేట్స్‌తో, ముఖ్యంగా రీతూ చౌదరితో సమయం గడుపుతు బిజీ గా ఉన్నాడు. ఇప్పటివరకు గేమ్‌లో పెద్దగా యాక్టివ్‌గా లేని ఆయన, ఈ వారం నామినేషన్స్‌లో కూడా ఉన్నారు.
ఇక కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి ఇటీవలే ఆయన తండ్రి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఓ ఇంటర్వ్యూలో కళ్యాణ్ తండ్రి మాట్లాడుతూ.. “మేము మధ్యతరగతి కుటుంబం. చిన్న షాప్ పెట్టుకొని కష్టపడి చదివించాం. మా కుటుంబంలో బాబాయి, అన్నయ్య పోలీస్ జాబ్‌లో ఉన్నారు. కళ్యాణ్ కూడా పోలీస్‌లో చేరతాడని అనుకున్నాం. కానీ అతను ఆర్మీని ఎంచుకున్నాడు” అని చెప్పారు.
ఇది కూడా చదవండి: VC.Sajjanar: ఎంజీబీఎస్‌కు రావొద్దు.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లివి!
కళ్యాణ్ ఆర్మీలో చేరిన తర్వాత తనపై కోపం పెంచుకొని, 14 నెలలు మాట్లాడకుండా దూరంగా ఉన్నాడని ఆయన తెలిపారు.
“ఫోన్ చేసినా కట్ చేసేవాడు. ఇంటికి వచ్చినా మాతో కూర్చొని రెండు మాటలు మాట్లాడేవాడు కాదు. సెలవులకు వచ్చినా ఫ్రెండ్స్ తోనే తిరిగేవాడు. ‘నేను మీకోసం రాలేదు, ఫ్రెండ్స్‌తో తిరగడానికి వచ్చాను’ అని చెప్పేవాడు” అని తండ్రి గారు చెప్పుకొచ్చారు.
అంతేకాక, కళ్యాణ్ ఇంట్లో కూడా ఎక్కువగా పనుల్లో సహకరించేవాడు కాదని, స్నానం చేసుకోవడానికి కూడా నీళ్లు నింపడం మేమే చేయాల్సి వచ్చేది అని ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు.
“మొదట జాబ్ వచ్చినప్పుడు చేయనని అన్నాడు. ‘జాబ్ చేయకపోతే ఇంటికి రావద్దు’ అని నేను చెప్పా. ఆ మాటలతోనే ఇప్పుడు ఇలా ఉన్నాడు. ఆ రోజే వదిలేస్తే ఈ రోజు ఇలా ఉండేవాడు కాదు” అని తండ్రి గారు అన్నారు.
బిగ్ బాస్ హౌస్‌లో గేమ్ కంటే వ్యక్తిగత వైఖరి, ఫ్యామిలీ బ్యాక్‌స్టోరీ కారణంగానే కళ్యాణ్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారారు. రాబోయే రోజుల్లో ఆయన గేమ్‌లోనూ యాక్టివ్‌గా ఉంటారా అన్నది చూడాలి.