Kalki 2898 AD: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తాజా చిత్రం ‘కల్కి 2898 ఎ.డి.’ ఇటీవల జపాన్ లో విడులైంది. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ప్రభాస్ జపాన్ వెళ్ళాల్సింది కానీ కాలి గాయం కారణంగా వెళ్ళలేదు. దాంతో చిత్ర దర్శకుడు నాగ అశ్విన్ జపాన్ వెళ్ళొచ్చారు. విశేషం ఏమంటే.. తొలిరోజు ‘కల్కి 2898 ఎ.డి.’ మంచి ఓపెనింగ్స్ ను సాధించింది. ఇది ‘సాహో’ రికార్డ్స్ ను చెరిపేసి, ‘ట్రిపుల్ ఆర్’ వెనుక నిలిచింది. నిజానికి జపాన్ లో ‘కల్కి’ చిత్రానికి ఆశించిన స్థాయిలో ప్రీ రిలీజ్ పబ్లిసిటీ జరగలేదు. అయినా ఈ మాత్రం ఓపెనింగ్స్ వచ్చాయంటే వండర్ అంటున్నారు జనాలు. ఇదే ఊపు ఇంకొంతకాలం కొనసాగితే.. ఖచ్చితంగా జపాన్ లోని భారతీయ చిత్రాలలో ‘కల్కి’ అగ్రస్థానంలో నిలుస్తుందని అక్కడి ట్రేడ్ వర్గాలు తెలిపాయి.