Best Cars for Long Drive

Best Cars for Long Drive: ఈ కార్లు లాంగ్ డ్రైవ్ కి అదుర్స్.. మైలేజ్, సేఫ్టీలో వీటిని కొట్టేవే లేవు!

Best Cars for Long Drive: కొత్త సంవత్సరం.. కొత్త కారు కొనాలని చూస్తున్నారా? ఏ కారు కొనాలా అని ఆలోచిస్తున్నారా? అయితే, ఈ విషయాలు ముందు తెలుసుకోండి. అసలు కారు ఎందుకు కొనాలని అనుకుంటున్నారు? రోజూ ఆఫీసుకు వెళ్లి రావడానికా? కుటుంబం అంతా అప్పుడప్పుడు ఎక్కడికైనా లాంగ్ ట్రిప్ వెళ్లేందుకా? ఇది క్లారిటీగా డిసైడ్ అవ్వండి. ఎందుకంటే, సిటీలో ఎక్కువగా కారులో తిరిగే అవసరం ఉంటే కొన్ని కార్లు అందుకు సరిపోతాయి. టాటా టియాగో, మారుతి స్విఫ్ట్ ఇలాంటివి. కానీ, లాంగ్ ట్రిప్ వెళ్లాలంటే మాత్రం బెస్ట్ మైలేజ్ తో పాటు జర్నీ కంఫర్ట్ గా జరిగేలా ఉండే కారు తీసుకోవడం మంచిది. కారు కొనే ముందు చాలా అంశాలు పరిగణనలోకి తీసుకోవాలి. ఇంజిన్ కెపాసిటీ, మైలేజ్ అలాగే సేఫ్టీ. ఎందుకంటే ఎక్కడికి వెళ్లినా సేఫ్ గా వెళ్లి తిరిగి రావాలి. అనుకోని ప్రమాదం జరిగినా మనకి, మనవారి ప్రాణాలకు భద్రతా ఉండాలి. ఇక మైలేజ్ ఎక్కువ వచ్చే కారు అయితే ఖర్చు తగ్గుతుంది. పొదుపు చేయగలుగుతారు. మరి ప్రస్తుతం మార్కెట్లో లాంగ్ డ్రైవ్ వెళ్ళడానికి అనుకూలంగా ఉన్న కొన్ని కార్లు.. వాటి వివరాలు మీకోసం ఇక్కడ ఉన్నాయి. 

హ్యుందాయ్​ క్రేటా:

  • ఇంజిన్​- 1493సీసీ
  • మైలేజ్​- 21.8 కేఎంపీఎల్​
  • ఎక్స్​షోరూం ధర- రూ. 11లక్షలు- రూ. 20.30లక్షలు
  • సేఫ్టీ రేటింగ్ – 5 స్టార్ 

మారుతీ సుజుకీ ఫ్రాంక్స్​:

  • ఇంజిన్​- 998 సీసీ
  • మైలేజ్​- 20.01 కేఎంపీఎల్​
  • ఎక్స్​షోరూం ధర రూ. 7.51లక్షలు- రూ .12.88లక్షలు
  • సేఫ్టీ రేటింగ్ – డేటా అందుబాటులో లేదు (డీలర్ ను సంప్రదించండి) 

ఇది కూడా చదవండి: Auto Tips: ట్రాఫిక్‌లో ఇంజిన్ ఆన్‌లో ఉంచుతున్నారా?.. అయితే మీ పెట్రోల్..!

టాటా పంచ్​:

  • ఇంజిన్​- 1199సీసీ
  • మైలేజ్​- 18.8 కేఎంపీఎల్​
  • ఎక్స్​షోరూం ధర- రూ. 6.13లక్షలు- రూ. 10.20లక్షలు
  • సేఫ్టీ రేటింగ్ – 5 స్టార్ 

టయోటా అర్బన్​ క్రూజర్​ హైరైడర్​:

  • ఇంజిన్​- 1490సీసీ
  • మైలేజ్​- 27.97 కేఎంపీఎల్​
  • ఎక్స్​షోరూం ధర- రూ. 11.14లక్షలు- రూ. 19.99లక్షలు
  • సేఫ్టీ రేటింగ్ – 4 స్టార్ 

మారుతీ సుజుకీ గ్రాండ్​ విటారా:

  • ఇంజిన్​- 1490సీసీ
  • మైలేజ్​- 27.97 కేఎంపీఎల్​
  • ఎక్స్​షోరూం ధర- రూ. 10.99లక్షలు- రూ. 20.09లక్షలు
  • సేఫ్టీ రేటింగ్ – 4 స్టార్ 

మారుతి సుజుకి డిజైర్​:

  • ఇంజిన్​- 1197 సీసీ
  • మైలేజ్​- 25.71 కేఎంపీఎల్​
  • ఎక్స్​షోరూం ధర- రూ. 6.79లక్షలు- రూ. 10.14లక్షలు
  • సేఫ్టీ రేటింగ్ – 5 స్టార్
ALSO READ  KTR: నేడు కేటీఆర్‌కు ఈడీ నోటీసులు ఇచ్చే అవకాశం

టాటా నెక్సాన్​:

  • ఇంజిన్​- 1497 సీసీ
  • మైలేజ్​- 24.08 కేఎఎంపీఎల్​
  • ఎక్స్​షోరూం ధర- రూ. 8లక్షలు- రూ. 15.30లక్షలు
  • సేఫ్టీ రేటింగ్ – 5 స్టార్ 

ఇక్కడ ఇచ్చిన ధరలు.. స్పెసిఫికేషన్స్ ఆయా కార్ల కంపెనీల వెబ్సైట్ నుంచి తీసుకున్నవి. కారు కొనేముందు సంబంధిత డీలర్స్ వద్ద నుంచి పూర్తి వివరాలు తెలుసుకుని.. మీ అవసరాలకు తగిన కారును ఎంపిక చేసుకోవడం మంచిది. కారు కొనే ముందు అన్ని అంశాలను జాగ్రత్తగా పరిశీలించుకోవడం చాలా అవసరం అనే విషయం గుర్తుంచుకోండి. ఎందుకంటే, డబ్బులు ఊరికే రావు కదా!

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *