KCR: కేసీఆర్‌ను 18 ప్రశ్నలు అడిగిన కాళేశ్వరం కమిషన్

KCR: కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిషన్‌ ముందు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కమిషన్‌ ఆయనను 18 కీలక ప్రశ్నలు అడిగింది. వాటికి కేసీఆర్ స్పష్టమైన సమాధానాలు ఇచ్చారు. నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని ప్రాజెక్ట్‌ను చేపట్టామని పేర్కొన్నారు. బ్యారేజీల నిర్మాణ స్థలాల ఎంపిక, మార్పు పూర్తిగా సాంకేతిక అంశమేనని ఆయన వివరణ ఇచ్చారు.

ముఖ్యమైన అంశాలు ఇలా:

నీటి లభ్యత ఆధారంగా ప్రాజెక్టు: నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకొని కాళేశ్వరం ప్రాజెక్ట్‌ చేపట్టామని కేసీఆర్ తెలిపారు.

బ్యారేజీల నిర్మాణ స్థల ఎంపిక: బ్యారేజీల స్థలాన్ని ఎంపిక చేయడం, మార్పులు చేయడం సాంకేతిక అంశాలపై ఆధారపడి జరిగిందని తెలిపారు.

నీటి నిల్వపై ఆదేశాలు ఇవ్వలేదన్న కేసీఆర్: బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయడంపై తానేనా ఆదేశాలు ఇచ్చానన్న ప్రశ్నకు, అలాంటిదేమీ లేదని స్పష్టం చేశారు.

ఆనకట్టల నిర్మాణ నిర్ణయం ఎవరిదన్న కమిషన్: దీనిపై వ్యాప్కోస్ (WAPCOS) సిఫార్సుల ప్రకారమే నిర్మాణాలు చేపట్టామని కేసీఆర్ వివరించారు.

రీఇంజినీరింగ్ వివరాలు: ప్రాజెక్ట్‌ రీఇంజినీరింగ్ అంశాలను కమిషన్‌కు పూర్తిగా వివరించినట్లు తెలిపారు.

కేబినెట్‌ ఆమోదం ఉందా?: కేబినెట్‌ మరియు ప్రభుత్వ ఆమోదంతోనే నిర్మాణాలు చేపట్టామని కేసీఆర్ స్పష్టం చేశారు.

అనుమతులపై స్పష్టత: అన్ని అనుమతులు, క్లియరెన్సులు తీసుకున్న తర్వాతే ప్రాజెక్ట్‌ను ప్రారంభించామని చెప్పారు.

నాణ్యతపై దృష్టి: నిర్మాణ నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చామని హామీ ఇచ్చారు.

ప్రాజెక్ట్‌పై ప్రచురణలు: కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన సమాచారాన్ని సమగ్రంగా సమీకరించిన పుస్తకాన్ని కమిషన్‌ చైర్మన్ పీసీ ఘోష్‌కు అందజేశారు.

ఈ విచారణలో కేసీఆర్ ఇచ్చిన సమాధానాలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై పలు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ కమిషన్‌ విచారణకు ప్రాధాన్యత పెరిగింది.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Bulli Raju: పొట్టోడే కానీ గట్టోడు.. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున ప్రచారం చేసిన బుల్లి రాజు.. వీడియో ఇదిగో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *