Sajjala Arrest Time: వైసీపీ నేతల వ్యాఖ్యలు ఆ పార్టీని మరింత ఇబ్బందుల్లో పడేస్తున్నాయా? అమరావతి రాజధానిపై విషం చిమ్మిన వైసీపీ.. ఇప్పుడు కూర్చున్న కొమ్మనే గొడ్డలితో నరుక్కుంటోందా? అమరావతి మహిళల ఆగ్రహాన్ని మరింత రెచ్చగొట్టిన సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు వైసీపీకి శాపంగా మారాయా? “వైసీపీలో సజ్జల ఒక్కడు ఉంటే చాలు, మా పార్టీకి తిరుగులేదు” అంటూ టీడీపీ నేతలు ఎందుకు మాట్లాడుకుంటున్నట్లు?
అమరావతిని ముంపు ప్రాంతం, భూకంప కేంద్రం, స్మశానం అంటూ వైసీపీ గతంలో దుష్ప్రచారం చేసింది. అయినా, ప్రజలు అమరావతికి జై కొట్టారు. ఇటీవల సాక్షి ఛానెల్‌లో జరిగిన డిబేట్‌లో వైసీపీ అనుకూల జర్నలిస్ట్ కృష్ణంరాజు అమరావతిని “వేశ్యల రాజధాని” అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు వెకిలి నవ్వుతో ఆ వ్యాఖ్యల్ని సమర్థించాడు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు ఉవ్వెత్తున లేచాయి. మాదిక కార్పొరేషన్ డైరెక్టర్ కంభంపాటి శీరిష ఫిర్యాదుతో తుళ్లూరు పోలీసులు కొమ్మినేనిని అరెస్ట్ చేశారు. వైసీపీ నేతలు దీనిని “మీడియాపై దాడి” అని, కూటమి ప్రభుత్వం “పోలీసు పాలన” సాగిస్తోందని గగ్గోలు పెట్టారు. ఈ వివాదంలో సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోశాయి. “ఇదంతా టీడీపీ కుట్ర” అని ఆరోపించిన సజ్జల.. అంతటితో ఆగకుండా, నిరసన తెలుపుతున్న మహిళలను “సంకర తెగ” అని అవమానించారు. ఈ వ్యాఖ్యలతో పెనం మీది నుండి పొయ్యిలో పడ్డట్టయింది వైసీపీ పరిస్థితి.
Also Read: Amaravati: రేపే తల్లికి వందనం ప్రారంభం
Sajjala Arrest Time: సజ్జల వ్యాఖ్యలతో జగన్, ఆయన సతీమణి భారతి తక్షణం క్షమాపణ చెప్పాలని రాష్ట్రవ్యాప్తంగా డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. సజ్జల వ్యాఖ్యలపై మంత్రి నారా లోకేష్ ఘాటుగా స్పందిస్తూ, “మహిళలపై తప్పుడు వ్యాఖ్యలకు చర్యలు తప్పవు” అని ట్వీట్ చేశారు. అది చేబ్రోలు కిరణ్ అయినా, కొమ్మినేని అయినా, సజ్జల అయినా… ట్రీట్మెంట్‌లో తేడా ఉండదంటూ.. జరగబోయేది ఏంటో హింట్ ఇచ్చారు.
లోకేష్ వ్యాఖ్యలతో సజ్జల అరెస్ట్ ఖాయమని రాజకీయ వర్గాలు చర్చిస్తున్నాయి. గత రెండు నెలలుగా ఆయనపై అనేక ఫిర్యాదులు వచ్చాయి. ఇప్పుడు ఆయన తాజా వ్యాఖ్యలు అరెస్ట్‌కు దారితీయనున్నాయి. వైసీపీలో ఏ2 స్థాయిలో కొనసాగిన విజయసాయిరెడ్డి సహా.. పలువురు సీనియర్లు.. సజ్జల వల్ల పార్టీకి నష్టమని బహిరంగంగానే విమర్శిస్తున్నారు. జగన్ చుట్టూ కోటరీ ఏర్పడిందని, కార్యకర్తలను, నేతలను దూరం చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. టీడీపీ నేతలు మాత్రం సజ్జలను జగన్ ఇంకా ఇంకా నమ్మాలని కోరుకుంటున్నారు. సజ్జల ఒక్కడు చాలు, వైసీపీ భూస్థాపితం అవడానికి అంటూ టీడీపీ నేతలు తాజా పరిణామాలపై చర్చించుకుంటున్నారట.